కాకినాడ పోర్టుపై సీఐడీ యాక్షన్ షురూ-సాయిరెడ్డి సహా వీరికి లుకౌట్ నోటీసులు..!
కాకినాడ పోర్టులో రూ.3600 కోట్ల విలువైన వాటాల్ని యజమానిగా ఉన్న తన నుంచి బెదిరించి లాక్కున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ వ్యవహారంలో సీఐడీ కీలక అడుగు వేసింది. కాకినాడ పోర్టులో వాటాల్ని బెదిరించి తక్కువ ధరకు లాక్కున్నారనే ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ ఇందులో నిందితులుగా ఉన్న కీలక వైసీపీ నేతలు విదేశాలకు పారిపోకుండా వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మరో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో అధినేత పెనాక శరత్ చంద్రారెడ్డితో పాటు మరికొందరికి సీఐడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. కాకినాడ పోర్టు వాటాల బదిలీ విషయంలో బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరు దేశం దాటి పోకుండా సీఐడీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వీరి విషయంలో సీఐడీ నెక్ట్స్ స్టెప్ ఏంటన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్టును నిర్వహిస్తున్న కర్నాటి వెంకటేశ్వరరావును అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామన్న హెచ్చరికలు చేసి బలవంతంగా షేర్లను అరబిందో సంస్థ పేరు మీద బదిలీ చేయించారనే ఆరోపణల్ని వీరు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిని అరెస్టు చేసి విచారణ చేసేందుకు సీఐడీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే వీరు దేశం వదిలి వెళ్లిపోకుండా కట్టడి చేసేందుకు లుకౌట్ నోటీసులు ఇచ్చింది. అయితే ఈ కేసులో సాక్ష్యాలు కీలకంగా మారాయి. వైసీపీ నేతలు నాలుగు గోడ్ల మధ్య కాకినాడ సీపోర్టు యజమానిని బెదిరించిన వ్యవహారాన్ని సీఐడీ నిరూపించాల్సి ఉంటుంది. మరోవైపు సీఐడీ లుకౌట్ నోటీసు నేపథ్యంలో వీరు కోర్టును ఆశ్రయించేందుకు సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications