సీఐడీ ఎంక్వైరీలో నారా లోకేష్ కుడి భుజం- గుట్లు మట్లపై కూపీ..?!
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. డజనుకు పైగా సూట్‌కేస్ కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే విషయం దర్యాప్తులో తేలడంతో సీఐడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

దీని తరువాత పలు కేసులు చంద్రబాబును చుట్టుముట్టాయి. ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలోనూ ఆయనపై కేసు నమోదైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని అంగళ్లు వద్ద చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులపై దాడి చేయడం-వాహనాలు తగులబెట్టిన ఘటనలోనూ కేసులు ఫైల్ అయ్యాయి.
రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అలైన్‌మెంట్ మార్పు వ్యవహారం కూడా చంద్రబాబును వెంటాడుతోంది. చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో ఇప్పటికే నారా లోకేష్.. సీఐడీ విచారణకు హాజరయ్యారు.
తాజాగా- నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా భావిస్తోన్న కిలారు రాజేష్‌ను సీఐడీ అధికారులు విచారిస్తోన్నారు. ఈ స్కామ్‌లో కిలారు రాజేష్ పాత్ర కీలకంగా ఉందంటూ ఇదివరకు విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. నారా కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరుందాయనకు. ఈ విచారణ సందర్భంగా ఆయా కేసులన్నీ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications