చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ - అర్ద్రరాత్రి నుంచి ఏం జరిగింది..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ అధికారులు అరెస్ట్ నోటీసు ఇచ్చారు. ఆరోగ్య పరీక్షల తరువాత విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసారు. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసులో స్పష్టం చేసారు. చంద్రబాబు పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. అరెస్ట్ సమయంలో అర్ద్రరాత్రి నుంచి పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఏపీలో రాజకీయంగా కలకలం మొదలైంది. రెండు రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపో, మాపో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేసారు. దీని పైన రాజకీయంగా చర్చ మొదలైంది. చంద్రబాబు చెప్పినట్లుగానే శుక్రవారం అర్ద్రరాత్రి నుంచి నంద్యాలలో చంద్రబాబు మకాం చేసిన క్యాంపు వద్ద పలు ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

తెల్లవారు జామున క్యాంపు వద్దకు చేరుకున్న పోలీసు అధికారులు నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నించారు. బస్సులో ఉన్న చంద్రబాబు బయటకు వచ్చిన తరువాత అధికారులు నోటీసులు ఇచ్చారు. అందులో అరెస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేసు వివరాలు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. ఆ సమయంలో చంద్రబాబు న్యాయవాదులు, పోలీసు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
సీఐడీ చెబుతున్నట్లుగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తన ప్రమేయం ఏంటని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ లో తన పేరు చూపించాలని నిలదీసారు. అన్ని సమర్పిస్తామని..ప్రొసీజర్ ప్రకారం అన్ని అందిస్తామని సీఐడీ అధికారులు స్పష్టం చేసారు. ఈ సమయంలో సీఐడీ అధికారులు నోటీసు ఇచ్చారు. సి ఆర్ పి సి సెక్షన్ 50(1) నోటీస్ ఐసీజన సి ఐ డి డిఎస్పీ ధనుంజయుడు ఈ నోటీసు అందించారు.

1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, red with 34 and 37 ipc సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసారు. చంద్రబాబు కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తరువాత విజయవాడ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబును తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు అధికారులు - చంద్రబాబు మధ్య చాలాసేపు అరెస్ట్ విషయం పైన వాగ్వాదం జరిగింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏ 1గా పేర్కొన్నారు. తన తప్పు ఉన్నట్లు ఆధారాలు ఉంటే ఉరి తీయాలని చంద్రబాబు పోలీసు అధికారులతో వ్యాఖ్యానించారు. ముందే రిమాండ్ రిపోర్టు ఇవ్వటం కుదరదని అధికారులు తేల్చి చెప్పారు. రిమాండ్ రిపోర్టులో అన్ని విషయాలు ఉంటాయని స్పష్టం చేసారు. అరెస్ట్ కు ముందే వివరాలు చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేసారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్...స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన సీఐడీ pic.twitter.com/09sZTEalJJ
— oneindiatelugu (@oneindiatelugu) September 9, 2023
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీతో పాటుగా ఈడీ అధికారులు విచారణ చేసారు. రూ 241 కోట్లు షెల్ కంపెనీలతో దారి మళ్లించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసారు. చంద్రబాబు అరెస్ట్ వార్తతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క సారిగా రాజకీయ కలకలం మొదలైంది. టీడీపీ నేతలు ఆందోళనకు సిద్దం అవుతున్న వేళ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.












Click it and Unblock the Notifications