దావోస్‌కు సీఎం చంద్రబాబు... 4 రోజులు 36 కార్యక్రమాలు
వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) దావోస్ సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన బృందం ఆదివారం విదేశీ పర్యటనకు బయల్దేరనుంది. నాలుగు రోజుల పాటు దావోస్‌లో జరగనున్న ఈ కీలక పర్యటనలో, ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా సీఎం విస్తృత స్థాయిలో సమావేశాలు, చర్చల్లో పాల్గొననున్నారు.
ఆదివారం రాత్రి 8.35 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం బృందం, అక్కడి నుంచి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌కు ప్రయాణం చేయనుంది. 19వ తేదీ అర్ధరాత్రి 1.45 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి, ఉదయం జ్యూరిచ్ చేరుకుంటారు. అక్కడ హిల్టన్ హోటల్‌లో స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్ ముఖ్యమంత్రితో మర్యాదపూర్వక భేటీ కానున్నారు. అనంతరం ఎరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ కిషోర్ లుల్లా, సహ అధ్యక్షులు రిథిమా లుల్లా, స్వనీత్ సింగ్‌లతో సీఎం సమావేశం జరగనుంది.

పర్యటన వివరాలు..
జ్యూరిచ్‌లో భారత ఎంబసీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. 20 దేశాల నుంచి వచ్చిన ఎన్ఆర్టీలతో జరిగే ఈ సమావేశంలో తెలుగు ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం రోడ్డు మార్గాన జ్యూరిచ్ నుంచి దావోస్‌కు సీఎం ప్రయాణం చేస్తారు.
తొలిరోజు..
దావోస్ పర్యటన తొలి రోజున యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో జరిగే బహుళ దేశాల సమావేశంలో సీఎం పాల్గొంటారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో కలిసి ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతోనూ సమావేశం జరగనుంది. ఈ రోజే అంతర్జాతీయ మీడియా సంస్థ 'పోలిటికో'కు సీఎం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు.
రెండో రోజు
రెండో రోజు పర్యటనలో 'ఇండియా ఎట్ సెంటర్ - జియోగ్రఫీ గ్రోత్, ఏపీ అడ్వాంటేజ్' అంశంపై సీఐఐ నిర్వహిస్తున్న బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంజ్ ప్రారంభోత్సవానికి హాజరవుతారు. ఐబీఎం చైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌లతో సీఎం కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ భేటీలకు ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా హాజరవుతారు.
అదే రోజు 'వన్ ఫ్యామిలీ - వన్ ఎంటర్‌ప్రెన్యూర్' ప్యానల్ డిస్కషన్‌లో పాల్గొన్న అనంతరం సీఎన్‌బీసీ ఇంటర్నేషనల్‌కు సీఎం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంక్, ఎన్విడియా ఉపాధ్యక్షుడు కాలిస్టా రెడ్మండ్, మోలర్ మేర్స్క్ సీఈఓ విన్సెంట్ క్లెర్క్ వంటి ప్రముఖులతోనూ సీఎం ముఖాముఖి భేటీలు జరగనున్నాయి.
మూడో రోజు..
మూడో రోజు పర్యటనలో పారిశ్రామిక అభివృద్ధి, ఇన్నోవేషన్, ఎనర్జీ ట్రాన్సిషన్, వాతావరణ మార్పులు, ఏఐ ఆధారిత గ్లోబల్ ఎకానమీ వంటి అంశాలపై జరిగే పలు సెషన్లలో సీఎం పాల్గొంటారు. బ్లూమ్‌బర్గ్ నిర్వహించే 'ఏఐ మూమెంట్ - ట్రాన్స్‌ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ' సెషన్‌లో ముఖ్య వక్తగా ప్రసంగించనున్నారు. ఏపీ లాంజ్‌లో నిర్వహించే మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొంటారు.
మొత్తంగా దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు 36 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రభుత్వాల మధ్య 3 కీలక సమావేశాలు, పారిశ్రామికవేత్తలతో 16 వన్-టు-వన్ భేటీలు, 9 రౌండ్ టేబుల్ చర్చలు జరగనున్నాయి. వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వనున్నారు.
జనవరి 22న దావోస్ నుంచి జ్యూరిచ్ చేరుకున్న సీఎం, అదే రోజు స్విట్జర్లాండ్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.35 గంటలకు భారత్‌కు బయల్దేరనున్నారు. 23వ తేదీ ఉదయం 8.25 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications