• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్వగ్రామంలో చంద్రబాబు, 21 ఏళ్ల తర్వాత , మనవడు దేవాన్ష్ హల్‌చల్, బాలయ్యతో కలిసి ఎడ్లబండి నడిపి..

By Ramesh Babu
|

చిత్తూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన స్వగ్రామమైన నారావారిపల్లెలో మంగళవారం విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు ఆయన వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి హీరో అయిన బాలకృష్ణ కూడా కుటుంబ సమేతంగా నారావారిపల్లెకు చేరుకుని తనదైన శైలిలో సందడి సృష్టించగా.. వీరిద్దరి ముద్దుల మనవడు దేవాన్ష్ హల్‌చల్ ఆకర్షణగా మారింది.

సంక్రాంతి పర్వదినాన్ని పురష్కరించుకుని కుటుంబంతో సహ శనివారమే చంద్రబాబు నారావారిపల్లెకు చేరుకున్న సంగతి తెలిసిందే. స్వగ్రామంలో పర్యటిస్తూ అక్కడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడమేగాక కొన్నింటికి ప్రారంభోత్సవాలు కూడా చేశారు.

బావ, బావమరిది ఇద్దరూ కలిసి...

బావ, బావమరిది ఇద్దరూ కలిసి...

సంక్రాంతి పండుగకు తన స్వగ్రామమైన నారావారిపల్లెకు చేరుకున్న అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన బావమరిది, సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబంతో కలిసి ఆదివారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత చంద్రగిరిలోగల హెరిటేజ్ ఫ్యాక్టరీని సందర్శించారు. దాదాపు 21 సంవత్సరాల తర్వాత ఆయన హెరిటేజ్ ఫ్యాక్టరీకి వెళ్ళారు.

ఇద్దరు తాతల ముద్దుల మనవడు...

ఇద్దరు తాతల ముద్దుల మనవడు...

ఇక ఇద్దరు తాతల ముద్దుల మనవడైన దేవాన్ష్ తాతగారి ఊరైన నారావారిపల్లెలో సందడి చేస్తున్నాడు. ఈసారి సంక్రాంతి శోభకు ఆ ఊర్లో ఆ బుల్లోడే ప్రత్యేక ఆకర్షణ. సీఎం చంద్రబాబు సంస్కృతి, సంప్రదాయాలకు విలువనిస్తూ సంక్రాంతి సంబరాలను తన సొంత ఊర్లో జరుపుకుంటుండగా.. ఆ ఊర్లో హడావిడి అంతా ఆయన మనవడు దేవాన్ష్‌దే అయింది. పండుగ సందర్భంగా ఎద్దులబండి తోలి అందరినీ ఆకట్టుకున్నాడు దేవాన్ష్. రైతు మాదిరి చర్నాకోల తిప్పుతూ హల్‌చల్ చేశాడు.

పంచ ధరించి శ్రీవారి దర్శనానికి...

పంచ ధరించి శ్రీవారి దర్శనానికి...

బోగి రోజు పంచ ధరించి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన దేవాన్ష్.. సంక్రాంతి రోజు కూడా సంప్రదాయ వస్త్రాధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బుడిబుడి అడుగులు వేసుకుంటూ అమాయకంగా చూస్తున్న ఆ పసివాడిని చూస్తూ నారావారిపల్లె వాసులు సంబరపడిపోతున్నారు. నారా కుటుంబానికి చెందిన బంధువుల చూపులన్నీ దేవాన్ష్‌పైనే ఉన్నాయి. చంద్రబాబు, లోకేష్ స్నేహితుల కుటుంబాలకు చెందిన వారు దేవాన్ష్‌ను ముద్దు చేస్తున్నారు. మొన్న హెరిటేజ్ కంపెనీలో, నిన్న కులదేవత నాగాలమ్మను దర్శించుకున్న సమయంలోనూ దేవాన్ష్ పంచకట్టులోనే కనిపించాడు.

మనవడు దేవాన్ష్‌తో కలిసి ఎడ్లబండిపై...

మనవడు దేవాన్ష్‌తో కలిసి ఎడ్లబండిపై...

ఒకవైపు తాతగారి ఇంట మనవడు దేవాన్ష్ సందడి చేస్తుంటే.. మరోవైపు వియ్యంకుడి ఇంట నందమూరి హీరో బాలకృష్ణ తనదైన శైలిలో హల్‌చల్ సృష్టించారు. బావ చంద్రబాబు ఇంట్లో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న బాలకృష్ణ.. ఎద్దులబండి తోలారు. నారావారి పల్లె వీధుల్లో బాలయ్య ఎద్దుల బండి తోలడాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. సినిమాల్లో ఎద్దులబండిని పరుగులు పెట్టించడం మాత్రమే చూసిన జనాలకు.. తమ కళ్లెదుటే బాలకృష్ణ ఎద్దులను పరుగులెత్తించడం ఆనందాన్ని కలిగించింది. బాలయ్య వెంట ముద్దుల మనవడు దేవాన్ష్ కూడా ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఎడ్ల బండిపై నారావారి పల్లె మొత్తం చుట్టేశారు.

English summary
Naravari Palle the birth place of CM Nara Chandra Babu Naidu turned as a most happening place for this Sankranthi. Babu and his family members are made special attraction to the people of Naravari Palle. Chandrababu's brother-in-law, Hindupur MLA, Actor Balakrishna also reached and created sensation in the village as he taken a bullock cart ride with his grand son Devansh. CM Chandrababu toured village to know the problems of the Villagers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X