తప్పు చేస్తే తోక కట్ చేస్తా.. ఏపీ సీఎం చంద్రబాబు వార్నింగ్ !

సీబీఎన్ 14 కాదు.. సీబీఎన్ 95 వచ్చాడు. తప్పు చేస్తే తోక కట్ చేస్తా అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా కుప్పంలో మొత్తం రూ.1292.74 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆ తర్వాత ప్రజావేదిక సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ పాలనపై తీవ్రంగా మండిపడ్డ చంద్రబాబు.. హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు చేయనన్నారు. అభివృద్ధి ఒక యజ్ఞం లాంటిదని.. రాక్షసుల్లా దానిని అడ్డుకుంటే ఒప్పేది లేదు అంటూ స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో నకిలీ మద్యం, అసభ్య ప్రవర్తన, మహిళలపై దాడులు జరిగాయని ఆరోపించారు. అంతే కాకుండా వైసీపీ పాలనలో భూముల రికార్డులు మొత్తం మార్చేశారని, పాత భూములను వైసీపీ నేతలు హస్తగతం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంలో పూర్తిస్థాయి భూ సర్వే చేస్తున్నామని, ప్రజల భూములకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆస్తులను సమర్థవంతంగా కాపాడతామని స్పష్టం చేశారు.

ap-cm-chandrababu-naidu-shocking-comments-at-kuppam-meeting

రైతులకు ఉచితంగా సౌర విద్యుత్..

ప్రతి ఇంటికి సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తూ, భవిష్యత్తులో విద్యుత్ బిల్లులు చెల్లించే అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం కింద బీసీలకు రూ.98 వేల రాయితీతో మూడు కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

కుప్పం - హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి..

కుప్పం నియోజకవర్గాన్ని రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఐదు కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి సామర్థ్యంతో వ్యవసాయ మార్కెట్‌ను బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో హంద్రీనీవా ద్వారా చివరి ఆయకట్టుకు నీళ్లు అందించేందుకు రూ.3829 కోట్లతో మౌలిక సదుపాయాలను అందిస్తామన్నారు. కుప్పానికి విమానాశ్రయం నిర్మాణం జరగనుందని, అలాగే కుప్పం-హోసూరు మధ్య సమాంతరంగా మరో రహదారి నిర్మిస్తామని చెప్పారు. పలమనేరు-కృష్ణగిరి మధ్య రూ.1000 కోట్లతో నాలుగు వరుసల రహదారి నిర్మిస్తామన్నారు. వ్యవసాయ భూములు ఇచ్చిన రైతులకు మెరుగైన ప్యాకేజీలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇంటింటికీ తమ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని తెలియపరిచేలా.. "సుపరిపాలన తొలి అడుగు" కార్యక్రమం మొదలుపెట్టినట్లు వివరించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని చంద్రబాబు అన్నారు. అభివృద్ధి కోసం కులాలు, మతాలు, ప్రాంతాలు అన్నదానికంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+