బాహుబలి చూశా, బాగుంది: రాజమౌళికి బాబు కితాబు, ఇదా టైమని రాహుల్‌కు

రాజమండ్రి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ దర్శకుడు రాజమౌళి పైన ప్రశంసల వర్షం కురిపించారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ఓ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ.. బాహుబలి చిత్రాన్ని తాను చూశానని చెప్పారు.

దానిని రాజమౌళి చాలా బాగా తెరకెక్కించారన్నారు. ఉత్తమ క్రియేటర్లలో రాజమౌళి ఒకరన్నారు. ఆయన ఏ సినిమా తీసినా ది బెస్ట్‌గా ఉండేలా తీస్తారన్నారు. అంటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పుట్టడం మన అదృష్టమన్నారు.

ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మంచి దర్శకులు ఉన్నారని, ఎంటర్ పెన్యూర్స్ ఉన్నారని అందరికీ తెలుస్తుందన్నారు. సినిమా వాళ్లు కొంత సమయాన్ని సినిమాలకు, సొంతానికి ఉపయోగించుకొని, కొంత సమయాన్ని సమాజానికి ఉపయోగించాలన్నారు. సమాజంలో మార్పు తీసుకు రావడం అందరికీ ఆనందం అన్నారు.

రాహుల్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్

AP CM Chandrababu praises Rajamouli

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఫారెన్ బాబు అయ్యారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యల పైన చంద్రబాబు స్పందించారు. రాహుల్ సమయం, సందర్భం లేకుండా రాష్ట్రంలో పర్యటిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు.

విభజన గాయాలు మానకమందే రాహుల్ గాంధీ పర్యటన విడ్డూరమన్నారు. మనకు రాజకీయాలు చేయవలసిన అవసరం లేదన్నారు. కొందరు రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ సమయం, సందర్భం లేని సమయంలో వచ్చి రాజకీయం చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీ చేసిన పని వల్లనే ఏపీకి నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు. ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా భయపడేది లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే రాహుల్ పర్యటన అన్నారు. మంచిపని చేసినంత వరకు కాంగ్రెస్ రాజకీయాలు మనలను ఏమీ చేయలేవన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+