18న ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ- ఈసారి ఫైనల్ వార్నింగ్ ఇచ్చేస్తారా?
ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో మరోసారి ఎన్డీయే పార్టీల ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే అధికారంలోకి వచ్చాక పలుమార్లు ఎన్డీయే ఎమ్మెల్యేలతో భేటీలు నిర్వహిస్తున్న చంద్రబాబు.. మరోసారి వీరిని కలుసుకోనున్నారు. రాష్ట్రంలో క్షేత్రస్దాయిలో వీరిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు ఏర్పాటు చేసిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రంలో తాజాగా మద్యం టెండర్ల ప్రక్రియ పూర్తయి షాపులు కేటాయించారు. అయితే ఇందులో ఎన్డీయే కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగి జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ. వీటిపై టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియాలోనే రోజూ వార్తలు వస్తున్నాయి. దీంతో చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మద్యం టెండర్లలో జోక్యం చేసుకున్న వారిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

అలాగే ఇసుక తవ్వకాల విషయంలోనూ అధికార పార్టీల నాయకులపై ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక, మద్యం వ్యవహారాలకు దూరంగా ఉండాలని నేరుగా సీఎం చంద్రబాబే చెప్తున్నా క్షేత్రస్దాయిలో నేతలు వినిపించుకునే పరిస్ధితులు లేవు. దీంతో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి అక్రమాల ఎమ్మెల్యేలకు మరోసారి హెచ్చరికలు పంపనున్నారు. అలాగే రాష్ట్రంలో త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాలపైనా నేతలతో చంద్రబాబు, పవన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications