Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జూన్‌8న ఏపీ కేబినెట్ విస్త‌ర‌ణ‌: వీరికి బెర్త్ ఖాయం..జ‌గ‌న్ ఫార్ములా ఇదే: ఆశావాహుల్లో ఉత్కంఠ‌..!

ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన జ‌గ‌న్..ఇక త‌న మంత్రివ‌ర్గం ఏర్పాటు పైన దృష్టి సారించారు. అందుకు జూన్‌8న ముహూర్తం ఖ‌రారు చేసారు. స‌రిగ్గా అయిదేళ్ల క్రితం 2014, జూన్ 8న ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీకరించారు. ఇప్పుడు జ‌గ‌న్ కేబినెట్ మంత్రులుగా ఎవ‌రికి అవ‌కాశం ఇవ్వాల‌నే అంశం పైన విస్తృత క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఎక్క‌డా బ్యాలెన్స్ త‌ప్ప‌కుండా ప్రాంతీయ‌..సామాజిక స‌మీక‌ర‌ణాల ఆధారంగా తుది రూపు ఇస్తున్నారు.

జూన్ 8న ఏపీ కేబినెట్ విస్త‌ర‌ణ‌..

జూన్ 8న ఏపీ కేబినెట్ విస్త‌ర‌ణ‌..

ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ డ్రీం కేబినెట్ జూన్ 8న కొలువు తీర‌నుంది. తొలుత త‌న‌తో పాటే మంత్రుల‌తోనూ ప్ర‌మాణ స్వీకారం చేయించాల‌ని భావించినా..వాయిదా ప‌డింది. మంత్రివ‌ర్గ కూర్పు మీద పూర్తి స్థాయి దృష్టి పెట్ట‌క పోవ‌టంతో వాయిదా వేసారు. ఇప్పుడు జ‌గ‌న్ జిల్లాల వారీగా తాను కోరుకుంటున్న వారి పేర్ల‌ను ఖ‌రారు చేసారు. వీరికి శాఖ‌ల కేటాయింపు బాధ్య‌త ముగ్గురు స‌భ్యుల‌తో ఏర్పాటు చేసిన క‌మిటీకి అప్ప‌గించారు.తొలి విడ‌త‌లో 10 నుండి 15 మంది వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని..స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు పూర్త‌యిన త‌రువాత పూర్తి స్థాయి కేబినెట్ విస్త‌ర‌ణ జ‌రిగే అవ‌కాశం ఉంది. అయితే, ఇప్ప‌టికే కేబినెట్‌లో స్థానం కోసం ప‌లువురు ఎమ్మెల్యేలు జ‌గ‌న్ పైన ఒత్తిడి తెస్తున్నారు. జ‌గ‌న్ మాత్రం ఆచి తూచి స్పందిస్తున్నారు. ఎవ‌రికీ స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వ‌టం లేదు.

కేబినెట్‌లో వీరికి ఖాయం...

కేబినెట్‌లో వీరికి ఖాయం...

జ‌గ‌న్ కేబినెట్‌లో అనుభ‌జ్ఞులు..జూనియ‌ర్లు మిక్స్‌డ్‌గా కేబినెట్ ఉండ‌నుంది. అందునా తొలి నుండి త‌న‌తో ఉన్న‌వారికే జ‌గ‌న్ ప్రాధాన్య‌త ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తుంది. ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, బొత్సా స‌త్య‌నారాయ‌ణ‌, కొల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి, పుష్ప‌శ్రీవాణి, అవంతి శ్రీనివాస్‌, ముత్యాల నాయుడు, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్, విశ్వ‌రూప్‌, వ‌నిత‌, గంధ్రి శ్రీనివాస్, కొడాలి నాని, పార్ధ‌సార‌ధి, మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ‌, ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, ఆదిమూల‌పు సురేష్‌, బాలినేని శ్రీనివాస‌రెడ్డి, మేక‌పాటి గౌతం, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఇక్బాల్‌, బుగ్గ‌న రాజేంద్రనాధ్ పేర్లు ఖాయంగా క‌నిపిస్తున్నాయి. అయితే సామాజిక స‌మీక‌ర‌ణాలు దృష్టిలో పెట్టుకొని..ప్రాంతాల వారీగా స‌మ‌తుల్య‌త పాటిస్తూ జ‌గ‌న్ తుది జాబితా ఖ‌రారు చేసే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే, మ‌హిళ‌లు..ఎస్సీ-బీసీల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్నారు.

అండ‌గా నిలిచిన వారికి ప్రాధాన్య‌త‌..

అండ‌గా నిలిచిన వారికి ప్రాధాన్య‌త‌..

వైసీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 151. అందులో జ‌గ‌న్‌ను మిన‌హాయిస్తే.. 150 మంది ఉన్నారు. చాలామంది కొత్త‌వారు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అందులో మొద‌టి సారి గెలిచిన వారిలో ఒక‌రిద్ద‌రు మిన‌హా మిగిలిన వారికి అవ‌కాశాలు త‌క్కువ‌గా క‌నిపిస్తున్నాయి. జ‌గ‌న్ పార్టీ ఏర్పాటు చేసిన స‌మ‌యంలో కాంగ్రెస్‌..టీడీపీని వ‌ద‌లి త‌న‌తో వ‌చ్చిన వారు..అదే విధంగా టీడీపీ ఎంత ఒత్తిడి తెచ్చినా జ‌గ‌న్ తోనే ఉన్న‌వారికి ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్నారు. ఇప్పుడు జ‌గ‌న్ పూర్తిగా పార‌ద‌ర్శ‌కంగా..అవీనీతి ర‌హిత పాల‌న అందిస్తామ‌ని చెబుతున్న స‌మ‌యంలో జ‌గ‌న్ ఎంపిక చేసుకొనే కేబినెట్ సైతం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌నుంది. అదే స‌మ‌యంలో ఆశావాహుల్లో ఉత్కంఠ పెంచుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+