నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్ .. బీజేపీ బంపర్ ఆఫర్ నేపధ్యంలో సర్వత్రా ఆసక్తి

Recommended Video

    నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్..!! || Oneindia Telugu

    ఏపీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలుసుకోనున్నారు . మూడు రోజులపాటు జగన్ ఢిల్లీ పర్యటన సాగనుంది. ఇక జగన్ ఢిల్లీ పర్యటన నేపధ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

     సీఎం అయ్యాక తొలిసారి ఢిల్లీ వెళ్తున్న జగన్ .. కేంద్ర పెద్దలతో చర్చలు, నీతిఆయోగ్ సమావేశం

    సీఎం అయ్యాక తొలిసారి ఢిల్లీ వెళ్తున్న జగన్ .. కేంద్ర పెద్దలతో చర్చలు, నీతిఆయోగ్ సమావేశం

    ముఖ్యంగా ఏపీ కి సంబంధించిన అభివృద్ధి పనుల గురించి చర్చలు జరపనున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా వైయస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో నిర్వహించి నీతి ఆయోగ్ సమావేశంలో కూడా పాల్గొననున్నారు జగన్ . అయితే జగన్ ఢిల్లీ టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు ముఖ్యమంత్రిగా తాను చేస్తున్న ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించటానికి వెళ్లిన జగన్ ఇప్పుడు మళ్లీ ఢిల్లీ వెళుతున్నారు. కానీ ఈ సారి రాష్ట్రానికి కేంద్రం నుండి కావలసిన సహకారానికి సంబంధించి ఆయా అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చించాలి అన్నదానిపై ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చిన జగన్ ఆయా అంశాలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయనున్నారు.

    ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా జగన్ వ్యూహం .. పార్లమెంట్ సమావేశాలకు దిశా నిర్దేశం

    ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా జగన్ వ్యూహం .. పార్లమెంట్ సమావేశాలకు దిశా నిర్దేశం

    అంతేకాదు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్న జగన్ ఏపీకి ప్రత్యేక హోదా నీతి ఆయోగ్ తో ముడిపడి ఉన్నందున ప్రత్యేక హోదా విషయంలో జగన్ ఒక నివేదికను తయారు చేసుకుని దానిని ప్రధాని నరేంద్ర మోడీకి అందించడానికి సిద్ధంగా ఉన్నారు.

    ఇక శనివారం నాడు నిర్వహించే వైయస్సార్ పార్లమెంటరీ సమావేశం లోనూ జగన్ పాల్గొంటారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలతో జగన్ చర్చించనున్నారు. ఈనెల 17 నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జగన్ ప్రత్యేక హోదా అంశమే లక్ష్యంగా ఎంపీలు పోరాటం చేయాలని చెప్పే అవకాశం ఉంది.

    ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అవుతారా ? జగన్ టూర్ పై ఆసక్తికర చర్చ

    ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అవుతారా ? జగన్ టూర్ పై ఆసక్తికర చర్చ

    కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక హోదా సాధించాలని భావిస్తున్న జగన్ కు తెలంగాణ రాష్ట్ర సీఎం కెసిఆర్ కూడా సహకారం అందిస్తారని భావిస్తున్నారు.

    ఇక జగన్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో మరో చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలో జగన్ భాగస్వామ్యం అవుతాడా? బిజెపి ఇస్తున్న ఆఫర్ ను జగన్ ఓకే చేస్తాడా? జగన్ ఢిల్లీ టూర్ ఏపీ లోని రాజకీయ పరిణామాలను మార్చేస్తుందా? ప్రత్యేక హోదా సాధన కోసమా? కేంద్రంతో దోస్తీ కోసమా ఢిల్లీ టూర్ అన్నది ఇప్పుడు ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనప్పటికీ జగన్ తాను అనుకున్నది సాధించడం కోసం కేంద్ర సర్కార్ తో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+