జగన్‌పై 'ఐరన్‌లెగ్' ముద్ర? బాబు నయా వ్యూహం
దుటివారిపై ఏదైనా ఒక ముద్ర వేయాలన్నా, లేదంటేమనకుఅనుకూలంగా ఒక ముద్ర ఉండాలన్నా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక పదాన్ని రూపొందించాలి. గత ఎన్నికల్లో జగన్ "ఒక్కసారి అవకాశంఇవ్వండి" అన్న ఒకే ఒక్క పదం ప్రజల్లోకి చొచ్చుకెళ్లడంతో ఒకసారి ఇచ్చిచూద్దాంలే అన్న ఆలోచనకు వచ్చిన ఓటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అది బాగా పనిచేస్తుందా? లేదా? అన్నది పక్కనపెడితే జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి ఉపయోగపడిన పదం "ఒక్కసారి అవకాశంఇవ్వండి.. ఒక్క ఛాన్స్ ప్లీజ్.!"

బాదుడే బాదుడులో వైసీపీ
మూడు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ప్రజారంజకమైన పరిపాలన అందించడంలో విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి తాజాగాఆయన బాదుడే బాదుడు కార్యక్రమం రూపొందించి జిల్లాల వారీగా పర్యటనలు చేస్తున్నారు. పన్నుల రూపేణా ప్రభుత్వం ప్రజల్ని ఎలాబాదుతుందో తెలియజెప్పడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం.

జగన్‌ది ఐరన్‌లెగ్!
ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి జగన్‌ది ఐరన్‌లెగ్ అని సంభోదించారు. జాగ్రత్తగా ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ జగన్‌పై ఐరన్ లెగ్ అనే ముద్రవేసి దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రణాళికరూపొందించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఐరన్ లెగ్ అంటే ఆ వ్యక్తి ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ సర్వనాశనమే అనే అర్థం వస్తుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొవిడ్ రావడం, ప్రకృతి ఉత్పాలు, ఆర్థిక పరిస్థితి ధ్వంసం అవడం, చెత్తపై పన్ను వేయడం.. తదితరాలను కారణాలుగా చూపించి ఆయనపై ఐరన్‌లెగ్ అనే ముద్ర వేస్తున్నారు.

రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితే
బాదుడే బాదుడు పర్యటన సాగినన్ని రోజులు జగన్‌ది ఐరన్‌లెగ్.. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏమీ ఉండదు.. అనే కోణంలో తెలుగుదేశం పార్టీ విస్త్రతంగా ప్రచారం చేయబోతోంది. అందుకనుగుణంగా ప్రజలు కూడా అదే అభిప్రాయానికి వస్తే రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొనాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఏదైనా ఒకసారి ఒక సెంటిమెంట్ పదం మనసులో నాటుకుంటే అంత తొందరగా పోదు.!!












Click it and Unblock the Notifications