ఆర్టీసీలో నియామకాలపై సీఎం జగన్ కీలక నిర్ణయం..!!

ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులకు సంబంధించి వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే క్రమంలో ఇప్పుడు ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. సర్వీసులో ఉండగా మరణించిన ఆర్టీసీ సిబ్బంది కుటుంబాలకు ఊరట కల్పిస్తూ అర్హులైన వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించనున్నారు. తాజాగా 2020 జనవరి 1 నుంచి ఇప్పటివరకు మరణించిన ఆర్టీసీ సిబ్బంది వారసులకు కూడా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారు.

2016 నుంచి 2020 జనవరి వరకు మృతి చెందిన 311 మంది ఆర్టీసీ సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటికే అనుమతించారు. ఆ ఉద్యోగాలను భర్తీ చేసిన ఆర్టీసీ యాజమాన్యం ప్రస్తుతం వారికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో రెండో విడత కారుణ్య నియామకాలకు ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. 2020 జనవరి 1 నుంచి 2023 ఆగస్టు 15 వరకు 1,538 మంది ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయారు. ఆయా కుటుంబాల్లో అర్హులైన వారసులకు కారుణ్య నియామకాల కింద మూడు దశల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు. మొదటి దశలో కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా కమిటీలు ఉద్యోగాలు కల్పిస్తాయి.

AP CM Jagan permits for providing jobs to 311 persons under compassionate grounds

ఆయా జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో వారిని నియమిస్తారు. జిల్లా కమిటీలు గుర్తించిన పోస్టులను భర్తీ చేయగా మిగిలిన వారికి ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పిస్తారు. అప్పటికీ ఇంకా అర్హులు మిగిలిపోతే వారికి మళ్లీ జిల్లా కమిటీల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తారు. ఇప్పటికే మొదటి దశగా జిల్లా కమిటీల ద్వారా కారుణ్య నియామకాల ప్రక్రియను చేపట్టారు. మిగిలిన ఉద్యోగాల కల్పనకు కూడా ఆర్టీసీ సమాయత్తం అవుతోంది. కారుణ్య నియామకాల కోసం ఆగస్టు 15 నాటికి ఆర్టీసీలో అందుబాటులో ఉన్న ఉద్యోగాలను గుర్తించారు. రాష్ట్రంలో 12 ఆర్టీసీ రీజియన్ల వారీగా మొత్తం 715 ఉద్యోగాలను గుర్తించారు.

ఈ గుర్తించిన వాటిలో డ్రైవర్‌ పోస్టులు 346, కండక్టర్‌ పోస్టులు 90, అసిస్టెంట్‌ మెకానిక్‌ పోస్టులు 229, ఆర్టీసీ కానిస్టేబుల్‌ పోస్టులు 50 ఉన్నాయి. కారుణ్య నియామకాల కింద ఈ పోస్టులను నెల రోజుల్లో భర్తీ చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. అర్హులైన వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+