సీఎం జగన్ పైచేయి...ఆయన కోరిందే కేంద్రం చేసింది : తెలంగాణ గరంగరం : ఇద్దరు సీఎంలు ఢిల్లీ కేంద్రంగా..!!
తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కొత్త టర్న్ తీసుకుంది. ఇప్పటి వరకు నీటి వినియోగాల పైన రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్దం సాగింది. ఒక రాష్ట్రం పైన మరో రాష్ట్రం ఫిర్యాదులు చేసుకున్నాయి. కృష్ణా బోర్డు తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఏపీ ఇప్పటి వరకు ఆరోపించింది. అదే విధంగా తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను పరిశీలించిన తరువాతనే రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించాలని ఏపీ స్పష్టం చేసింది. అయితే, ఏపీ సీఎం జగన్ నేరుగా ప్రధానికి వరుసగా లేఖలు రాసారు.

జగన్ కోరిన అంశాలనే అమలు చేస్తూ..
విస్తరించిన కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నిర్వహణను రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లు కృష్ణా, గోదావరి బోర్డులకు అప్పగించాలని కోరారు. ప్రాజెక్టుల నిర్వహణ బోర్డులకే అప్పగించాలని సూచించారు. దీంతో పాటుగా ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలను మోహరించాలని లేఖలో కోరారు. ఇప్పుడు కేంద్రం అవే నిర్ణయాలను అమలు చేస్తూ రెండో బోర్డుల గెజిట్ లు విడుదల చేసింది. ఈ నిర్ణయాల పైన తెలంగాణ గరగరం గా ఉంది. కేంద్రం నిర్ణయం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టుల పర్యవేక్షణ, నిర్వహణ అధికారం బోర్డులకు అప్పగిస్తుండటంతో ప్రాజెక్టుల వద్ద కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు(సీఐఎ్‌సఎఫ్) కాపలా కాయనున్నాయి.

కేంద్ర బలగాలు..కేంద్ర సిబ్బంది పర్యవేక్షణ..
ప్రస్తుతం కృష్ణా ప్రాజెక్టుల వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసులు కాపలాగా ఉంటున్నారు. ఇక ముందు రాష్ట్ర పోలీసులకు ప్రవేశం కూడా ఉండదు. అదే విధంగా... ఉండదు. ప్రాజెక్టుల గేట్లను ఎత్తడం... దించడం... వరద నీటి ప్రవాహ పరిస్థితులు గమనించడం, ఏ సమయంలో జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలి? ఏ సమయంలో నిలుపుదల చేయాలనే నిర్ణయాలన్నీ బోర్డు అధికారులే తీసుకుంటారు. బోర్డులలో రెండు రాష్ట్రాల అధికారులు ఉంటారు. బోర్డుల నిర్వహణకు అయ్యే వ్యయం అంతా రెండు రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది.

తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం..
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించి, సీఐఎస్ఎఫ్ కు భద్రత అప్పజెప్పాలని ఏపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతుండగా... తెలంగాణ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కృష్ణా జలాల కేటాయింపు వివాదం తేలకుండా బోర్డులకు ఏ విధంగా ప్రాజెక్టులు అప్పగిస్తారని రాష్ట్రం ప్రశ్నిస్తోంది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో స్టే ఉందని, జలాల కేటాయింపు ఫైనల్ కాకుండా ఏ విధంగా అప్పగిస్తారనేది తెలంగాణ వాదన. జలాల కేటాయింపు తేలకుండా, నీటి విడుదలపై కేఆర్‌ఎంబీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ వాదిస్తోంది.
Recommended Video

కేంద్ర నిర్ణయంతో ఇక ఢిల్లీ కేంద్రంగా..
ఏపీ ప్రభుత్వం కేంద్ర తాజా నిర్ణయాన్ని స్వాగతిస్తోంది. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి ఈ గజెట్ ల పైన న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మధ్నాహ్నం పార్టీ ఎంపీలతో సీఎం సమావేశం కానున్నారు. ఆయన ఆ సమయంలో ఈ తాజా పరిణామం పైన తమ వైఖరి స్పష్టం చేసే అవకాశం ఉంది. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం ఇక ఢిల్లీ కేంద్రంగా ఇద్దరు ముఖ్యమంత్రులు...రెండు పార్టీల ఎంపీలు కేంద్రంతో తేల్చుకోవటానికి సిద్దపడుతున్నారు.












Click it and Unblock the Notifications