coronavirus: వైద్యులకు సెల్యూట్, కొద్దిరోజుల్లో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు: సీఎం జగన్

ఢిల్లీ నుంచి వచ్చిన వారందరినీ గుర్తించామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని.. మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని పేర్కొన్నారు. శుక్రవారం అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా రోగులకు వైద్యం అందజేస్తోన్న సిబ్బంది సేవలను సీఎం జగన్ కొనియాడారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వైద్యుల సేవలు ఆమూల్యమైనవవని జగన్ గుర్తుచేశారు. రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులు చాలా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. పారామెడికల్ సిబ్బంది, నర్సులు, పారిశుద్ద్య కార్మికుల సేవల సర్వదా గుర్తిండిపోతాయని చెప్పారు. ఆపత్కాలంలో సేవలు అందిస్తోన్న వారిని గుర్తించుకుంటామని.. వారికి తగిన సాయంలో ప్రోత్సాహకం అందజేస్తామని సంకేతాలు ఇచ్చారు.

ap cm jagan salute to doctors who serve to corona patients..

వాస్తవానికి రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు తక్కువే ఉండేవని గుర్తుచేశారు. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారితో ఆ సంఖ్య ఆమాంతం పెరిగిందని చెప్పారు. దీంతో భయంకర పరిస్థితి నెలకొందని.. కానీ ఇప్పుడు సిచుయేషన్ కంట్రోల్‌లో ఉంది అని వివరించారు. కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తోన్న వైద్యులకు సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+