వామ్మో: పొడినేలపై నాట్లు వేయడమా..ఇది చంద్రబాబుకే సాధ్యం
Recommended Video

ప్రపంచంలో పబ్లిసిటీ కోసం పాకులాడే నేతలు ఎవరైనా ఉన్నారంటే వారంతా ఏపీ సీఎం చంద్రబాబు తర్వాతే. అది మేమంటున్న మాటలు కావు... నెటిజెన్లు గుప్పిస్తున్న విమర్శలు. లేనిపోని హంగు ఆర్భాటాలకు పోయి ఫోటోలకు ఫోజులిచ్చి చంద్రబాబు పలు సందర్భాల్లో అభాసుపాలయ్యారు కూడా. ఇక సోషల్ మీడియా ఊపు అందుకున్నాక రాజకీయ నాయకులు లేనిపోని ఆర్భాటాలకు పోయి అడ్డంగా బుక్కవుతున్నారు. ఉదాహరణకు బీకాంలో ఫిజిక్స్ అని చెప్పి విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు ఫోటో కూడో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవ్వడమే కాదు నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్స్ రాస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే. ప్రభుత్వ కార్యక్రమం ఏరువాక సందర్భంగా చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో ఓ ఫోటోకు ఫోజిచ్చారు. చక్కగా తెలుగుదనం ఉట్టిపడేలా తెలుపు రంగు పంచ, నలగని చొక్కా, మెడలో కండువా ఆపై నెత్తికి రుమాలు చుట్టి అచ్చం రైతులా కనిపించారు. అంతేకాదు కాళ్లకు సాక్సులు,చెప్పులు ధరించారు. ఇక నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. నాట్లు సాధారణంగా బురద మట్టిలో వేస్తారు. కానీ చంద్రబాబు పొడి నేలపై నాట్లు వేస్తూ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో నెటిజెన్లు వారికి తోచినట్లుగా కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు ఇదే ఫోటోను ఓ ప్రముఖ వార్తాపత్రిక కూడా ప్రచురించడంతో నెటిజెన్లు ఆ పత్రికను కూడా ఉతికారేశారు. ఎంత తలతిక్క ప్రచారం కోసమైనా సరే, ఏమిటీ పైత్యం అంటూ కామెంట్ చేసిన నెటిజన్లు పక్కన వారితో కూడా పొడి నేలపై నాట్లు వేయించి అవమానించారని మరికొందరు నెటిజెన్లు వాపోయారు.
గతంలో కూడా చంద్రబాబు వ్యవసాయంపై చులకన భావం ప్రదర్శించారని నెటిజెన్లు గుర్తు చేశారు. వ్యవసాయం దండుగా, కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలనే చంద్రబాబు వ్యాఖ్యలను నెటిజెన్లు గుర్తుచేశారు. ఓవరాల్‌గా ఒక్క ఫోటోతో గతం కూడా తవ్వితీస్తున్నారు నెటిజెన్లు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications