వైఎస్ జగన్ గుడ్ న్యూస్... ఒక్కొక్కరికి రూ.10 లక్షలు
విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రవాసాంధ్ర భీమా భరోసా పథకం కింద తమ పేర్లు నమోదు చేసుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది. ఈనెల 15వ తేదీ వరకు విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. 15వ తేదీ తర్వాత బీమా ప్రీమియం పెరిగి ప్రయోజనాలు తగ్గనుండటంతో విదేశాల్లో చదువుకుంటున్నవారు, విదేశాల్లో పనిచేస్తున్నవారు ప్రవాసాంధ్ర బీమా భరోసా పథకంలోకి పేర్లు ఎంట్రీ చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది.
విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు విదేశాల్లో మంచి విద్యను అందించేందుకు లక్షలాది రూపాయలు ఖర్చుపెడుతున్నారు. అలా విదేశాలకు వెళ్లిన పిల్లలు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. అటువంటి సమయంలో వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఏపీన్ఆర్ టీఎస్ పథకం అక్కరకొస్తోంది. ఇందులో చేరడంవల్ల కుటుంబానికి ఆసరాగా ఉంటుందని ఏపీఎన్నార్టీ సొసైటీ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి సూచించారు. పథకం కింద పేర్లు ఉచితంగా నమోదు చేసుకోవచ్చన్నారు.

బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదం వల్ల మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. ప్రమాదం వలన సంభవించే గాయాలు, అనారోగ్యానికి చికిత్స కోసం ఆసుపత్రికి అయ్యే ఖర్చు కింద రూ.లక్ష చెల్లిస్తారు. ప్రమాదానికి గురైన విద్యార్థి చదువు కొనసాగించడానికి అనర్హుడైతే స్వదేశం వచ్చేందుకు సాధారణ తరగతి విమాన ఛార్జీలను కూడా చెల్లిస్తారు. పేర్లు నమోదు చేసుకునేందుకు APNRTS 24/7 హెల్ప్‌లైన్ 91-863-2340678; 91-85000 27678 నెంబరులో(వాట్సాప్), https://www.apnrts.ap.gov.in/index.php/home/insurance_new లో లాగిన్ అయ్యి వివరాలు నమోదు చేయాలి.












Click it and Unblock the Notifications