ఆ కేసుల రీ ఓపెన్ - సజ్జల సహా వైసీపీ నేతలకు ఉచ్చు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వైసీపీ హయాంలో జరిగిన రాజకీయ దాడులు..కేసుల పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. పాత కేసులపైన ప్రభుత్వం స్టేటస్ రిపోర్టు కోరింది. ముఖ్య కేసులను రీ ఓపెన్ చేస్తోంది. విచారణ చేస్తే వైసీపీ ముఖ్య నేతలకు ఉచ్చు ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం వివరాలు కోరిన కేసుల్లో సజ్జలతో సహా వైసీపీ ముఖ్య నేతలు ఉన్నారు. దీంతో..ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తిగా మారుతోంది.
కేసుల వివరాలు
వైసీపీ హాయంలో రాజకీయంగా అనేక కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ కేసుల వివరాల పైన కొత్త ప్రభుత్వం ఆరా తీస్తోంది. అందులో ప్రధానంగా ఉండవల్లిలో నాడు టీడీపీ అధినేత చంద్రాబు ఇంటి పైన దాడి కేసు విచారణ పై స్టేటస్ రిపోర్టు కోరారు. చంద్రబాబు ఇంటి పైకి మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటుగా వైసీపీ శ్రేణులు దాడికి దిగారని అభియోగాలు నమోదయ్యాయి. ఆ సమయంలో టీడీపీ నేతల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ప్రధానంగా జోగి రమేష్ తో పాటుగా వైసీపీ ముఖ్య నేతల పైన ఇప్పుడు విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది.

ప్రధాన నేతలకు ఉచ్చు
ఇక, టీడీపీ కార్యాలయంలోకి వెళ్లి వైసీపీ శ్రేణులు విధ్వంసం చేసారు. పార్టీ కార్యాలయంలో అద్దాలు ,ఫర్నీచర్ ధ్వంసం చేస్తూ అక్కడి సబ్బందిని భయబ్రాంతులకు గురి చేసారు. ఆ కేసులో వైసీపీ నేతలు అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్ పైన ఆరోపణలు వచ్చాయి. అదే విధంగా విజయవాడలో టీడీపీ నేతల ఇంటి పైన దాడి ఘటన కేసు పైన వివరాలు సేకరిస్తున్నారు. ఇక..ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణ తనను చంపమని ప్రభుత్వంలో నాడు కీలకంగా వ్యవహరించిన సజ్జల రామక్రిష్ణారెడ్డి వ్యవహరించారని ఆరోపించారు. దీని పైన విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది.
చట్ట పరంగా ముందుకు
వీటితో పాటుగా చిత్తూరు జిల్లా కేంద్రంగా చోటు చేసుకున్న రాజకీయ దాడుల విచారణ పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. కరోనా సమయంలో వివాదాస్పదంగా మారిన డాక్టర్ సుధాకర్ మరణం, పమలనేరు మిస్బా వ్యవహారంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రాజకీయ దాడుల కేసుల గురించి వివరాలు సేకరిస్తున్నారు. నాడు విచారణ జరిగిన తీరు...పోలీసులు ఏం తేల్చారనే అంశం పైన నివేదికలు కోరుతున్నారు. వీటి ద్వారా నాడు దాడులకు పాల్పడిన వైసీపీ నేతల పైన చట్ట పరంగానే మందుకు వెళ్లాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ పరిణామాలు వైసీపీలో ఆందోళన పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications