కేసీఆర్‌కు షాక్: ఏపీ సీఎస్ ఢిల్లీలో బీజీ, ఫోన్ ఆపరేటర్ల నుంచి సమాచారం కేంద్రానికి?

న్యూఢిల్లీ: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గురువారం ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి సిఎల్ గోయల్, కేంద్ర టెలికామ్ కార్యదర్శి గార్గ్‌తో గురువారం నాడు విడివిడిగా సమావేశమయ్యారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని వివిధ అంశాల అమలుపై కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి గోయల్‌తో చర్చించారు. అలాగే హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు సంబంధించిన సెక్షన్-8 అమలుపై కూడా చర్చించినట్లు కృష్ణారావు వివరించారు.

అదే విధంగా 9, 10 షెడ్యూల్‌లోని ప్రభుత్వరంగ సంస్థల పంపిణీపై చర్చించినట్ల చెప్పారు. హోంశాఖ కార్యదర్శితో సమావేశం ముగిసిన అనంతరం ఆయన టెలికామ్ కార్యదర్శితో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య తీవ్ర దుమారం లేపుతున్న ఫోన్ ట్యాపింగ్ అంశంపై కూడా చర్చించి ఉంటారని భావిస్తున్నారు.

 AP complaint against KCR on Phone tapping

ట్యాపింగ్‌పై ఆధారాలు కేంద్రానికి!

కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ మంత్రి సుజనా చౌదరి గురువారం హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి కేసీఆర్ జరుపుతున్న టెలిఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేశారు.

తెలంగాణలో ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికలకు సంబంధించిన ఓటుకు నోటు కేసులో సుజనా పాత్ర కూడా ఉన్నదనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన హోంశాఖ మంత్రిని కలుసుకోవటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సుజనా చౌదరితోపాటు కృష్ణారావు కూడా రాజ్‌నాథ్‌ను కలిశారు. చంద్రబాబుతోపాటు మొత్తం 120 మంది ప్రజాప్రతినిధుల టెలిఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందనేది ప్రధాన ఆరోపణ. సుజనా ఈ అరోపణను రుజువు చేసేందుకు తమ ప్రభుత్వం సేకరించిన సమాచారంతో కూడిన ఒక నివేదికను రాజ్‌నాథ్ సింగ్‌కు అందజేశారని తెలుస్తోంది.

టెలిఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి వివిధ టెలిఫోన్ సంస్థల నుండి సేకరించిన సమాచారం, ఇతరత్రా రాబట్టిన సమాచారాన్ని ఈ నివేదికలో పొందుపరిచినట్లు చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఆంధ్రా నేతల టెలిఫోన్లను ట్యాప్ చేసేందుకు అధునాతన యంత్ర పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తోందని, విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ఆధునిక యంత్ర పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్న సూచనలేవీ కనిపించటం లేదని కూడా సుజనా హోం శాఖ మంత్రికి చెప్పినట్లుగా తెలిసింది.

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న టెలిఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు జరిపించాలని ఆయన రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారని సమాచారం. కృష్ణారావు టెలిఫోన్ ట్యాపింగ్‌పై ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యల గురించి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారని తెలుస్తోంది. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో తమకు రక్షణ లేకుండా పోతోందని సుజనా ఫిర్యాదు చేశారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+