సీపీఎస్ రద్దు చేయాల్సిందే.. లేదంటే "సమ్మె" బాట
సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను పథకం) రద్దు చేయకుంటే సమ్మె తప్పదని హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం. ఈమేరకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన "సీపీఎస్ పై సమరభేరి" సభలో తీర్మానం జరిగింది. జనరల్ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపు స్టేట్ గవర్నమెంట్ దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉద్యోగులు. జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు.
సీపీఎస్ అమలుపై వేసిన కమిటీని తీవ్రంగా వ్యతిరేకించిన ఉద్యోగులు.. రానున్న బడ్జెట్ సమావేశాల్లో సీపీఎస్ రద్దు ప్రకటించాలని డిమాండ్ చేశారు. దాని స్థానంలో పాత ఫింఛను విధానం పునరుద్ధరించేలా ప్రకటన చేయాలని కోరారు. లేనిపక్షంలో అన్నీ ఉద్యోగ సంఘాలతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఎన్‌ఎస్‌డీఎల్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కోరారు. ఇంతకుముందు సీపీఎస్ రద్దు కోరుతూ విజయవాడ ఆమరణ దీక్షలో పాల్గొన్న 26 మంది ఉద్యోగులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.













Click it and Unblock the Notifications