ఆందోళనలు, సమ్మెతో నో యూజ్.. ఎక్కడ జీతం తగ్గిందో చెప్పండి: ఉద్యోగులకు ఏపీ సీఎస్ సూటి ప్రశ్న
కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన "చలో విజయవాడ" పై ఏపీ సీఎస్ సమీర్ శర్మ స్పందించారు. ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు, సమ్మెలతో ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. తాము ఎప్పుడూ ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేశాు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయిని పేర్కొన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంతో చర్చలు జరపకపోతే సమస్యలెలా తీరుతాయని పీఆర్సీ సాధన సమితి నేతలను సీఎస్ సూటిగా ప్రశ్నించారు.

జీతం ఎక్కడ తగ్గిందో చెప్పండి..
ఉద్యోగులు ఎక్కడ జీతం తగ్గిందో ప్రభుత్వానికి చెబితేనే కదా తెలిసేదని సీఎస్ సమీర్ శర్మ పేర్కొన్నారు. గత రెండున్నరేళ్లుగా మధ్యంతర భృతి ఇస్తున్నామని చెప్పారు. మధ్యంతర భృతి అనేదాన్ని ఎక్కడో ఒక చోట అడ్జెస్ట్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. హెచ్‌ఆర్‌ఏపై ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వం చర్చిస్తేనే కదా సమస్యలు తెలిసేదని ప్రశ్నించారు. ఉద్యోగులకు కావాల్సింది ఏంటో చెబితే కూర్చొని మాట్లాడతాన్నారు.

డీఏ ఇస్తే ప్రభుత్వానికి రూ. 10 వేల కోట్లు మిగిలేవి..
కొత్త పీఆర్సీ వల్ల ఏ ఒక్క ఉద్యోగికి జీతాలు తగ్లేదని సీఎస్ సమీర్ శర్మ పేర్కొన్నారు. ఐఆర్‌తో కొత్త పీఆర్సీని పోల్చి చూడటం సరికాదన్నారు. పాత పీఆర్సీతో కొత్త పీఆర్సీని పోల్చి చూడాలని కోరారు. కొత్త పీఆర్సీ తీసుకురావడం వలన రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ.10 వేల కోట్ల రూపాయల భారం పడుతుందని తెలిపారు. తెలంగాణలోలా తాము కూడా అప్పట్లోనే డీఏ ఇస్తే ప్రభుత్వానికి రూ. 10 వేల కోట్లు మిగిలేదని అన్నారు. ఉద్యోగుల సమస్యలను చర్చించేందుకు మంత్రుల కమిటీ ఉందని పేర్కొన్నారు.

చర్చించుకుందాం రండి..
రాష్ట్రంలో ఉద్యోగులకు సమస్యలున్న మాట నిజమని.. వాటిని చర్చించి పరిష్కరించుకోవాలని సీఎస్ సమీర్ శర్మ కోరారు. కరోనా వల్ల రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. పే స్లిప్‌లో పది రకాల విషయాలు ఉంటాయని, అన్నీ సరి చూసుకోవాలని తెలిపారు. 11వ పీఆర్సీలో 27 శాతం మేర ఐఆర్‌ను 30 నెలలపాటు ఇచ్చామని తెలిపారు.
ఉద్యోగులకు ఐఆర్ రూపంలో రూ. 18 వేల కోట్లను ఇచ్చినట్లు వెల్లడించారు. ఐఆర్ అనేది వడ్డీ లేని రుణం.. దాన్ని సర్దుబాటు చేయాల్సిందేనని సీఎస్ సమీర్ శర్మ తేల్చిచెప్పారు.












Click it and Unblock the Notifications