ఏపీ అడ్వకేట్ జనరల్‌గా సుబ్రమణ్యం శ్రీరాం: అదనపు ఏజీగా సుధాకర్ రెడ్డి: ఈ ఇద్దరే ఎందుకంటే..!
ఏపీ నూతన మఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్ కీలక పదవుల్లో సమర్ధులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వానికి కీలకమైన అడ్వకేట్ జనరల్‌తో పాటుగా అదనపు అడ్వకేట్ జనరల్ గా ఎవరిని నియమించాలో నిర్ణయించారు. అడ్వకేట్ జనరల్‌గా సుబ్రమణ్యం శ్రీరాం..అదనపు అడ్బకేట్ జనరల్‌గా సుధాకరెడ్డి పేర్లు ఖరారు చేసారు. వీరిని జగన్ ఎంపిక చేయటం వెనుక భారీ కసరత్తు జరిగింది.
ఆ ఇద్దరికీ అవకాశం ..
టీడీపీ ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్‌గా పని చేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ రాజీనామా చేసిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఆ పదవిలో కొత్త వ్యక్తి పేరును ఖరారు చేసింది. అడ్వకేట్ జనరల్‌గా సుబ్రమణ్యం శ్రీరాంను, అదనపు అడ్వకేట్ జనరల్‌గా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేరును కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఖరారు చేసారు. సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం వీరిద్దరి పేర్లను అధికారికంగా ప్రకటించనున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. ఇక, ఇదే సమయంలో టీడీపీ హయాంలో నియమితులైన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిళ్లు కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు, జీపీలు, ఏజీపీలు, స్టాండింగ్ కౌన్సిళ్ల నియామకాలను పూర్తి చేసేందుకు ఏజీగా, అడిషనల్‌గా ఏజీగా నియమితులు కానున్న శ్రీరాం, పొన్నవోలు ఇప్పటికే కసరత్తు చేసినట్లు తెలిసింది.

ఆ ఇద్దరికే ఎందుకంటే..
సుబ్రమణ్యం శ్రీరాం గతంలో 2009-2011 మధ్య కాలంలో నాటి అడ్వకేట్ జనరల్ డీవీ సీతారామ మూర్తి వద్ద ప్రభుత్వ న్యాయవాదిగా పని చేసారు. 1969 జౌలై 5న జన్మించిన శ్రీరాం 1996 నుండి న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. కానిస్టిట్యూషనల్ లా, విద్యా, సర్వీసు, సివిల్, క్రిమినల్, కమర్షియల్ రంగాల్లో చట్టాల పైన ప్రావీణ్యం సాధించారు. ఇక, అదనపు అడ్వకేట్ జనరల్‌గా ఎంపికైన సుధకార్ రెడ్డి వైసీపీకి సంబంధించి అనేక కేసుల్లో వాదనలు చేసారు. ఓట్ల గల్లంతు.. సదావర్తి భూముల వ్యవహారం..చంద్రబాబు పైన ఓటుకు నోటు కేసులో ఆర్కే ఇంప్లీడ్ అయిన సమయంలో ఆయన వాదనలు వినిపించారు. దీంతో..ఆయనకు అదనపు అడ్వకేట్ జనరల్‌గా అవకాశం కల్పించారు.
-
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications