తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీకి ప్రత్యామ్నాయం?
AP Assembly election 2024: అనంతపురం జిల్లాలోని తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం మరోసారి హాట్ సీట్‌గా మారింది. దశాబ్దాలుగా జేసీ బ్రదర్స్‌కు పట్టం కట్టిన ఈ నియోజకవర్గం ఇది. 2019 ఎన్నికల్లో తొలిసారిగా చెక్ పడింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా పాతింది. 2024 ఎన్నికలు ఎలా ఉండబోతోన్నాయనేది ఆసక్తికరంగా మారింది.
అనంతపురం లోక్‌సభ పరిధిలోని జనరల్ సీటు.. తాడిపత్రి. పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. సంఖ్యాపరంగా చూసుకుంటే- రెడ్డి సామాజికవర్గం అధికంగా ఉంటుందీ కనిగిరి అసెంబ్లీ పరిధిలో. ఆ తరువాత బీసీలు, దళితులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. కమ్మ సామాజిక వర్గ ఓటర్ల సంఖ్య ఫర్వాలేదనిపించుకునే స్థాయిలో ఉంటుంది.

జేసీ బ్రదర్స్‌కు కంచుకోట. జేసీ సోదరులు వరుసగా ఏడుసార్లు ఇక్కడి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జేసీ దివాకర్ రెడ్డి ఆరుసార్లు విజయఢంకా మోగించారిక్కడ. 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఆవిర్భావం తరువాత రెండుసార్లు మాత్రమే టీడీపీ గెలిచిన సీటు ఇది. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఆ పార్టీ తరఫున ఎం కేశవరెడ్డి గెలిచారు. మళ్లీ 2014 వరకూ కాంగ్రెస్ హవా వీచింది. రాష్ట్ర విభజన తరువాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జేసీ కుటుంబం మొత్తం టీడీపీకి షిఫ్ట్ అయింది. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా జేసీ ప్రభాకర్ రెడ్డి గెలిచారు.
2019లో తొలిసారిగా జేసీ కుటుంబం ప్రాభవానికి తెరదించింది వైఎస్ఆర్సీపీ. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి బోణీ కొట్టారు. జేసీ కుటుంబానికి చుక్కలు చూపారు. 1985 తరువాత జేసీ కుటుంబం మొట్టమొదటిసారిగా తాడిపత్రి నియోజకవర్గాన్ని కోల్పోయింది. ప్రత్యర్థికి ధారదాత్తం చేయాల్సి వచ్చింది.
2014 ఎన్నికల్లో కూడా దాదాపుగా కేతిరెడ్డి పెద్దారెడ్డే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపుగా ఖాయమైనట్టే. ఇప్పటివరకు కేతిరెడ్డిని మార్చాలనే ఆలోచన ఏదీ చేయట్లేదు వైసీపీ. టీడీపీ తరఫున ఎవరు ఎన్నికల రేసులో నిల్చుంటారనేది ఇంకా తేలట్లేదు. 2019లో పోటీ చేసిన జేసీ అస్మిత్ రెడ్డికి టికెట్ లభిస్తుందా? లేక ప్రత్యామ్నాయం చూస్తుందా? అనేది చర్చనీయాంశమైంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications