జగన్ సర్కార్ నోటీసులపై కేఆర్ సూర్యనారాయణ రియాక్షన్ ఇదే...!
ఏపీ గవర్నర్ తో భేటీ కావడంతో పాటు బహిరంగ వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి సర్కార్ ఇవాళ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. దీనిపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ స్పందించారు.
మీడియాలో మాట్లాడినందుకు ప్రభుత్వం తమకు నోటీసులు ఇచ్చిందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ తెలిపారు. సంజాయిషీ ఇచ్చేటప్పుడు అన్ని కారణాలు వివరిస్తానన్నారు.అవసరమైతే న్యాయపరమైన అంశాలు కూడా పరిశీలిస్తామన్నారు. నిబంధనలు అతిక్రమించలేదని ప్రభుత్వానికి వివరిస్తామని ఆయన వెల్లడించారు.నోటీసులు ఇచ్చేటప్పుడు మా ఆర్థిక పరమైన చెల్లింపులపై షెడ్యూల్ ఇస్తే బాగుండేదన్నారు..
చర్యలకు అర్హులమైతే ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ ఫర్వాలేదన్నారు.

ఉద్యోగులకు ఇవ్వాల్సిన 10వేల కోట్ల బకాయిలు రోజురోజుకూ పెరుగుతున్నాయని కేఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు. 2001లో ఇచ్చిన రోసా నిబంధనలు ఎలా ఉన్నాయో అధ్యయనం చేయాలన్నారు. నిబంధనలు ఒక సంఘానికే పరిమితం అవుతాయా? లేదా అనేది చూడాల్సి ఉందన్నారు. తద్వారా ప్రభుత్వం తమను టార్గెట్ చేస్తుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వానికి సూర్యనారాయణ త్వరలో వివరణ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది కీలకంగా మారింది.తాము ఆర్థిక సంబంధమైన వ్యవహారాలపై గవర్నర్ కలిసినందుకు ప్రభుత్వం నోటీసు ఇవ్వలేదని, గవర్నర్ ను కలవడం తప్పు అని ప్రభుత్వం చెప్పలేదని కేఆర్ సూర్యనారాయణ తెలిపారు. మీడియాతో మాట్లాడటంపైనే ప్రభుత్వం ప్రశ్నించిందన్నారు. అందరు ఉద్యోగసంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూనే వున్నారన్నారు. ఈ నిబంధన అందరికీ వర్తించదా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మా వివరణతో సంతృప్తి చెందుతుందని భావిస్తున్నామని, లేదంటే తమ ప్రణాళిక తమకు వుందన్నారు.
మరోవైపు తన ఉద్యోగ సర్వీసులో అక్రమాలకు పాల్పడినట్లు చేసే ఆరోపణలకు సమాధానం చెప్పబోనని సూర్యనారాయణ తెలిపారు. ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసులు మెరుగుతుంటే తాను సమాధానాలు చెప్పననన్నారు. మొరిగే ప్రతి ఒక్కరికీ సమాధానం ఎందుకు చెప్పాలన్నారు. చదువురాని వారందరూ ఏదో మాట్లాడుతూనే వుంటారన్నారు. మా సంఘానికి గుర్తింపు ఇస్తే తాము ఇబ్బందులు పడతారని ఏపీ ఎన్జీవో సంఘం అనే వ్యాపార సంస్థ మొక్కని కాళ్లు లేవన్నారు. ఎల్వీ సుబ్రమణ్యం తో లాబీయింగ్ వల్ల తమ సంఘానికి గుర్తింపు రాలేదన్నారు. ఎన్నో ఎళ్లుగా ఫైల్ నడిపామమన్నారు. తమ సంఘానికి అర్హత వుందని సీఎం జగనే చెప్పారన్నారు. అర్హత లేకుంటే గుర్తింపు రద్దు చేసేవారన్నారు.












Click it and Unblock the Notifications