మద్యం కొనాలంటే.. ఇక ఇలా తప్పనిసరి- తాజా మార్గదర్శకాలు..!!

మద్యం విక్రయాల విషయంలో ఏపీ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం అమ్మకాల్లో కొత్త విధానం అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ఈ పాలసీకి సంబంధించిన ఫైలు వచ్చే మంత్రి వర్గ సమావేశం ముందుకు రానుంది. మంత్రివర్గ ఆమోదం లభించగానే తమ ప్రతిపాదనల మేరకు ఈ కొత్త విధానం అమల్లోకి తీసుకురానుంది. దీని ద్వారా విక్రయాల్లో పారదర్శకత పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే, ఈ విధానం పైన మందు బాబుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది కీలకంగా మారుతోంది.

మద్యం విక్రయాల్లో ఎక్సైజ్‌ శాఖ నూతన విధానం తీసుకురానుంది. 'లిక్కర్‌ డిజిటల్‌ చెల్లింపులు' పేరుతో ఈ పాలసీని అమలు చేయనుంది. ప్రస్తుతం డిజిటల్‌ లావాదేవీలు జరుగుతున్నా ఈ విధానాన్ని శాశ్వత ప్రాతిపదికన అమలు చేసేందుకు 'లిక్కర్‌ డిజిటల్‌ చెల్లింపులు' పేరుతో ఈ పాలసీని అమలు చేయనుంది. ఈ పాలసీకి సంబంధించిన ఫైలు వచ్చే మంత్రి వర్గ సమావేశం ముందుకు రానుంది. నెల రోజుల వ్యవధిలో ఈ పాలసీ అమల్లోకి తీసుకొచ్చే విధంగా ఎక్సైజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. పాలసీ అమల్లోకి వచ్చాక ప్రతి బార్‌, మద్యం షాపులో కచ్చితంగా డిజిటల్‌ చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. ఈ విధానం ప్రకారం.. మద్య కొనుగోలుదారులు డిజిటల్‌ విధానంలో బిల్లు చెల్లింపులు డిజిటల్ విధానంలో కొనసాగనున్నాయి. డిజిటల్ చెల్లింపుల ను విక్రయదారులు తిరస్కరించకూడదని అధికారులు స్పష్టం చేసారు. డిజిటల్‌ చెల్లింపుల సౌకర్యం ఉండాలనే నిబంధనను మద్యం షాపులు, బార్‌ పాలసీల్లో ఎక్సైజ్‌ శాఖ పేర్కొంటోంది. ప్రతిసారీ పాలసీలో ఈ నిబంధన తప్పనిసరిగా పెట్టాల్సి వస్తోంది. అయితే, ఈ నిబంధనను షాపులు, బార్ల లైసెన్సీలు సీరియ్‌సగా తీసుకోవడం లేదు.

ap-excise-key-proposals-before-govt-over-payments-for-liquor-sales-in-all-bars-also-in-wine-shops

డిజిటల్ పేమెంట్స్ పై మార్గదర్శకాలు

ఈ నేపథ్యంలో ప్రతిసారీ మద్యం పాలసీల్లో ఈ నిబంధన పెట్టాల్సిన అవసరం లేకుండా డిజిటల్‌ చెల్లింపులను శాశ్వతంగా అమలుచేయడం కోసం ఈ పాలసీని ఎక్సైజ్‌ శాఖ తీసుకురానుంది. ప్రస్తుత విధానంలో డిజిటల్‌ చెల్లింపులు చేసినా ఆ విషయం సంబంధిత లైసెన్సీకి మాత్రమే తెలుస్తుంది. ప్రస్తుతం సుమారు 30శాతం మేర డిజిటల్‌ చెల్లింపులు జరుగుతున్నా ఆ సమాచారం ఎక్సైజ్‌కు చేరడంలేదు. నూతన పాలసీ అమల్లోకి వచ్చాక ఎవరు డిజిటల్‌ చెల్లింపు లు చేశారనే సమాచారం రియల్‌టైమ్‌లో ఎక్సైజ్‌ డేటాబేస్‌లో నిక్షిప్తం అయ్యేలా సాంకేతికంగా సిద్దం చేసారు. డిజిటల్‌ చెల్లింపులతో పాటు ఎక్సైజ్‌ శాఖ కొత్తగా 'ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌' విధానాన్ని తీసుకువస్తోంది. కొత్త ట్రాకింగ్‌ విధానంలో ప్రతి షాపు, బారుకు స్కానర్‌ ఇస్తారు. కచ్చితంగా స్కాన్‌ చేసిన తర్వాత మాత్రమే సీసాలను వినియోగదారులకు విక్రయించాలి. స్కాన్‌ చేసిన వెంటనే ఆ సమాచారం ఎక్సైజ్‌ డేటాబేస్‌కు చేరుతుంది. ఆ తర్వాత వినియోగదారుడు డిజిటల్‌ పేమెంట్‌ చేస్తే ఆ సమాచారం కూడా ప్రభుత్వానికి తెలుస్తుంది. దీంతో.. మద్యం కొనుగోలు కోసం ఇక డిజిటల్ చెల్లింపులకు సిద్దం కావాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+