ఏపీలో ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు- ఈ సారి వారికే కేటాయింపు, విక్రయాలు ఇక..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 2024 అక్టోబర్ 12న అమల్లోకి వచ్చిన రెండేళ్ల పాలసీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కొత్త పాలసీ ఖరారు పైన కసరత్తు కొనసాగుతోంది. అందులో భాగంగా ఎక్సైజ్ శాఖ పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రధానంగా పాలసీ రెన్యువల్‌పైనే చర్చ సాగుతోంది. దీంతో.. ప్రస్తుతం ఉన్న వారికే మరోసారి మద్యం షాపులు దక్కే అవకాశం ఉంది. దీని పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
ఏపీలో కొత్త మద్యం పాలసీ పైన పలు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్సింగ్ గడువు ముగియనుంది. దీంతో.. కొత్త పాలసీ పైన కసరత్తు జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత ప్రైవేట్ రిటైల్ విధానాన్ని అమల్లోకి తెచ్చి 3,396 షాపులకు లైసెన్సులు కేటాయించింది. గతంలో షాపుల కేటాయింపు సమయాన దరఖాస్తు ఫీజుల ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 1,900 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే, ఆ తర్వాత తాము ఆశించిన స్థాయిలో వ్యాపార మార్జిన్లు రాక నష్టపోయామని అనేకమంది లైసెన్సీలు గగ్గోలు పెట్టడంతో ప్రభుత్వం తర్వాత మార్జిన్లను కొంత పెంచింది. ఈ నేపథ్యంలో కొత్త పాలసీకి వెళ్తే అన్ని దరఖాస్తులు రాకపోవచ్చనే అభిప్రాయం ఉంది. దానివల్ల ప్రభుత్వ ఖజానాకు లోటు ఏర్పడే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. దీంతో కొత్త పాలసీకి కాకుండా ప్రస్తుత లైసెన్సీలతోనే పాలసీ రెన్యువల్ చేయాలనే ప్రతిపాదన సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.















Click it and Unblock the Notifications