ప్యాకేజీ ఫస్ట్, హోదా నెక్స్ట్ : బాబు భారీ ప్లాన్ ఏమిటి, ఏది బెట్టర్?
విజయవాడ: కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యల ద్వారా ఇప్పట్లో ప్రత్యేక హోదా రాదనే విషయం తేటతెల్లమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏం చేస్తారనే చర్చ సాగుతోంది. కేంద్రం హోదా బదులు దానికి తగినట్లుగా భారీ ప్యాకేజీ కోసం కసరత్తు చేస్తోంది.
కేంద్రం హోదాను మించిన ప్యాకేజీ ఇస్తే పవన్ కళ్యాణ్ మిన్నకుంటారా, తన మూడంచెల ఉద్యమాన్ని ఆపుతారా అనే చర్చ సాగుతోంది. కేంద్రంలో హోదా లేదా ప్యాకేజీ పైన తాజా కదలికకు పవన్ కళ్యాణే కారణం అని చెప్పవచ్చు. గత శనివారం తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన హోదా పైన బీజేపీని నిలదీశారు. అప్పటి నుంచి కదలిక ప్రారంభమైంది.
పవన్ కళ్యాణ్ విషయాన్ని పక్కన పెడితే.. అధికారంలో ఉన్న, కేంద్రంలో, రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న టిడిపి ఏం చేస్తుందనే చర్చ సాగుతోంది. సుజన మాటలను చూస్తుంటే.. కేంద్రం మొదట భారీ ప్యాకేజీ ఇస్తుంది. ఆ తర్వాత హోదా కోసం టిడిపి తన వంతు ప్రయత్నాలు చేస్తుంది.

చంద్రబాబు ప్లాన్
హోదా, ప్యాకేజీ విషయంలో చంద్రబాబు ప్లాన్‍గా వెళ్తున్నారని అంటున్నారు. ఎలాగు ఇప్పుడు హోదా వచ్చే పరిస్థితి లేనందున.. తొలుత భారీ ప్యాకేజీని తీసుకొని, ఆ తర్వాత హోదా కోసం కేంద్రం పైన ఒత్తిడిని కొనసాగించాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తొలుత భారీ ప్యాకేజీ, ఆ తర్వాత హోదా... చంద్రబాబు ప్లాన్‌గా తెలుస్తోంది. బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ కోసం కూడా చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు.
హోదా - ప్యాకేజీ..ఏది బెట్టర్?
హోదా, ప్యాకేజీ విషయాలలో ఏది ముఖ్యమంటే రెండూ ముఖ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, విభజన నేపథ్యంలో ఏపీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈ నేపథ్యంలో తక్షణం ప్యాకేజీనే మంచిదనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. అదే సమయంలో దీర్ఘకాలికంగా ఉపయోగపడే హోదా కూడా ముఖ్యమని అంటున్నారు.
హోదా అంటే దీర్ఘకాలిక భరోసా, ప్యాకేజీ తాత్కాలిక ఊరట. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ప్యాకేజీ తక్షణ అవసరమే వాదనలు వినిపిస్తున్నాయి. హోదా అవసరమే.. కానీ ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి హోదా ఇచ్చినప్పటికీ వెంటనే ఊరట లభిస్తుందన్న నమ్మకం లేదని, ప్యాకేజీ ఇస్తే మాత్రం నిధులు వస్తాయని అంటున్నారు.
కాబట్టి తక్షణ అవసరం ప్యాకేజీయే బెట్టర్ అనే వాదనలు వినిపిస్తున్నాయని అంటున్నారు. ఆ తర్వాత అందరు కలిసి హోదా కోసం హోదా కోసం కేంద్రం పైన ఒత్తిడి తేవడం సముచితమనే వాదనలు వినిపిస్తున్నాయి. తక్షణ సాయంతో ఏపీకి కొన్ని ఇబ్బందులు తగ్గుతాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications