నిన్న పూజిత, నేడు టెక్కీ భార్య అనూష మృతి: సవాల్
హైదరాబాద్: వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న నవ వధువు (అనూష) కేసును పోలీసులు విచారిస్తున్నారు. పంజాగుట్ట ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంకు చెందిన అనూష సీఏ పూర్తి చేసింది. గత ఏడాది జూలై నుండి బంజారాహిల్స్‌లోని ఓ సంస్థలో పని చేస్తోంది. రాజ్ భవన్ రోడ్డులోని ఓ అపార్టుమెంటులోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది.
ఈ నెల 8వ తేదీన అనూషకు రాజమండ్రికి చెందిన సాఫ్టువేర్ ఇంజనీర్ అర్జున్‌తో వివాహం జరిగింది. ఆదివారం సాయంత్రం ముషీరాబాదులోని తన బంధువుల ఇంటికి వెళ్లిన అనూష రాత్రి పదిన్నరకు హాస్టల్‌కు తిరిగి వచ్చింది. అయితే, ఉదయానికి ఆమె శవమై కనిపించింది. ఒంటి పైన గాయాలు లేవు. నోటి నుండి తెల్లటి నురుకు రావడంతో విషం తాగి ఆత్మహత్య చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు.

అనూష
ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. హైదరాబాదులోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజభవన్‌రోడ్‌లోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో అనూష అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

అనూష
సమాచారం అందుకున్న క్లూస్ టీం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.

అనూష
ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్య చేసి పరారయ్యారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పూజిత
కాగా, కొద్ది రోజుల క్రితం రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పంజాగుట్ట ఐఏఎస్ క్వార్టర్స్‌లో వాసిరెడ్డి పూజిత సజీవ దహనమైన విషయం తెలిసిందే. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు మరింత పురోగతి సాధించారు. రెండు సూసైడ్ నోట్లు ఆమె రాసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దానికి తోడు ఫేస్‌బుక్‌లోంచి కొన్ని వివరాలు సేకరించగలిగారు.
అనూషతో పాటు హాస్టల్లో మొత్తం 8 మంది ఉంటున్నారు. అనూష ఉండే గదిలో హర్షిత అనే మరో యువతి ఉంటోంది. ఆమె షిరిడీ వెళ్లడంతో అనూష ఒక్కతే ఉన్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ వచ్చిన హర్షిత హాస్టల్లోని తన గదికి వెళ్లి చూడగా బెడ్ పైన అనుమానాస్పద స్థితిలో పడి ఉంది. పోలీసులకు సమాచారం అందించారు. 108 సిబ్బంది అనూషను పరిశీలించి మృతి చెందినట్లు చెప్పారు.
క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌లను రప్పించి ఆధారాల కోసం చూశారు. పోలీస్ జాగిలం మృతదేహం వద్ద నుండి డోర్ పక్కనే ఉన్న లిఫ్ట్ వద్దకు వచ్చి, తిరిగి కామన్ బాల్కనీలోకి వెళ్లింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనూష తల్లిదండ్రులు, భర్త వచ్చారు. కాగా, ఇప్పటికే పూజిత మృతిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిన్న పూజిత, ఇప్పుడు అనూష మృతి పోలీసులకు సవాల్‌గా మారిందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications