అమెరికాలో అనుమానాస్పద స్థితిలో ఆంధ్ర అమ్మాయి మృతి
గుంటూరు: అమెరికాలో అలబామా రాష్ట్రంలో గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం పెదరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అబ్బూరి లావణ్య అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన శుక్రవారంనాడు వెలుగులోకి వచ్చింది. ఆమె మృతదేహం దగ్గరలోని ఓ నీటి గుంటలో కనుగొన్నారు. లావణ్య అలబామా యూనివర్శిటీలో చదువుకుంటోంది.
27 ఏళ్ల లావణ్య మృతితో ఆమె కుటుంబం, బంధువుల్లో తీవ్ర విషాదం అలుముకుంది. అలబామా యూనివర్శిటీలో ఆమె పీహెచ్‌డీ చేస్తోంది. ఇక కనిపించబోనని లావణ్య స్నేహితురాలికి ఓ మెసేజ్ పంపినట్లుగా తెలియవచ్చింది.

లావణ్య ఆత్మహత్య చేసుకున్నట్లుగా అందరూ భావిస్తున్నారు. ఆమె ఎందుకు మృతిపై అమెరికా పోలీసులు విచారణ జరుపుతున్నారు. లావణ్య మృతదేహానికి ఫోరెన్సిక్ అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
లావణ్య గత ఏడాది అమెరికాలో పిహెచ్‌డీ చేసేందుకు వెళ్ళిందని బంధువులు చెప్పారు. లావణ్య మృత దేహం రెండు, మూడు రోజుల్లో ఇండియాకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని బంధువుల పేర్కొన్నారు.
హజరత్ బాబు, శివమ్మల మూడో కూతురు లావణ్య. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బిఎస్పీ పూర్తి చేసి ఉన్నత చదవుల కోస అమెరికా వెళ్లింది. తరుచుగా ఆమె అట్టాంటాలో ఉంటున్న తన బావ అలపర్తి సురేష్ బాబు, వెంకటలక్ష్మిలతో మాట్లాడుతుండేది. బుధవారంనాడు వారు అమెకు ఫోన్ చేశారు. అయితే, ఆమె నుంచి స్పందన రాలేదు.












Click it and Unblock the Notifications