ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్- మరోసారి తగ్గిన కరోనా కిట్ల ధరలు- కొ త్త రేటు ఇదే
కరోనా బాధితులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా పరీక్షలు చేయించుకునేందుకు గతంలో భారీగా ఉన్న రేట్లను క్రమంగా తగ్గిస్తున్న ప్రభుత్వం ఇవాళ మరో నిర్ణయం తీసుకుంది. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలకు వాడే కిట్‌కు గతంలో ఉన్న ధరను మూడొంతులు తగ్గిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
గతంలో ఏపీలో కరోనా నిర్దారణకు వాడే ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల కిట్‌ను రూ.750 రూపాయలకు విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పట్లో వాటికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ రేటు వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు డిమాండ్ తగ్గడంతో రేట్లు కూడా దిగొస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్ ధరను రూ.230కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచే రేటు అమల్లోకి రానుందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఐసీఎంఆర్‌తో పాటు ప్రభుత్వ అనుమతితో ల్యాబ్‌లు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వీటిలో వాడుతున్న కిట్ల ధరలు తగ్గించడంతో రోగులకు ఆ మేరకు ఊరట దక్కనుంది. అన్ని ఛార్జీలతో కలిపి ఒక్కో ర్యాపిడ్ యాంటిజెన్ కిట్‌కు కేవలం రూ.230 మాత్రమే వసూలు చేయాలని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఆనిల్ సింఘాల్ ఇవాళ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతకు మంచి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications