Deputy Tahsildar: సర్వీస్ రూల్స్‌లో కీలక మార్పులు! గెజిటెడ్ హోదా

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో అత్యంత కీలకమైన డిప్యూటీ తహసీల్దార్ పోస్టుల భర్తీ, సర్వీసు నిబంధనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్ సర్వీస్ రూల్స్‌లో పలు సవరణలు చేస్తూ రెవెన్యూశాఖ జీవో నంబర్ 626 ద్వారా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం డిప్యూటీ తహసీల్దార్ పోస్టును 'ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) రూల్స్, 1992' పరిధిలో ప్రత్యేకంగా 'కేటగిరీ-4' గా చేర్చారు. ఈ కొత్త మార్పులు గత జూలై 15 నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది డిప్యూటీ తహసీల్దార్లకు గెజిటెడ్ హోదా లభించనుంది.

కేటగిరీ-4 పరిధిలోకి వచ్చే పోస్టులివే!

ప్రభుత్వం సవరించిన నిబంధనల ప్రకారం.. డిప్యూటీ తహసీల్దార్ పోస్టుతో పాటు స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ (రిసర్వే) పోస్టులను కూడా ఈ కేటగిరీ-4 కిందకే తీసుకొచ్చారు. ఇకపై ఈ పోస్టులన్నింటికీ సవరించిన సర్వీస్ రూల్స్, జోనల్ పరిధి నిబంధనలే వర్తిస్తాయి.

AP Government Amends Service Rules for Deputy Tahsildars New Rules for Direct Recruitment amp amp Promotions

నియామకానికి రెండు మార్గాలు

డిప్యూటీ తహసీల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం రెండు పద్ధతులను ఖరారు చేసింది.

  • డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా నిర్వహించే పోటీ పరీక్షల ద్వారా అభ్యర్థులను నేరుగా ఎంపిక చేస్తారు.
  • ప్రమోషన్: రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న అర్హులైన సీనియర్ అసిస్టెంట్ల నుంచి ప్రమోషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
MRO అధికారాలు, నెల జీ<strong>తం ఎంతో తెలుసా..?</strong>
MRO అధికారాలు, నెల జీతం ఎంతో తెలుసా..?

విద్యార్హతలు - వయోపరిమితి

  • డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అభ్యర్థులకు: నియామక ప్రకటన వెలువడే నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే, నోటిఫికేషన్ వెలువడే సంవత్సరం జూలై 1 నాటికి అభ్యర్థి వయస్సు 34 సంవత్సరాలు పూర్తి కాకూడదు.
  • ప్రమోషన్ ద్వారా ఎంపికయ్యే ఉద్యోగులకు: రెవెన్యూ శాఖలోని సీనియర్ అసిస్టెంట్లు డిప్యూటీ తహసీల్దార్‌గా ప్రమోషన్ పొందాలంటే కనీసం 4 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. ఈ 4 ఏళ్ల సర్వీసులో కనీసం 2 సంవత్సరాలు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) గా పనిచేసిన అనుభవం తప్పనిసరి.

స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు ప్రత్యేక వెసులుబాటు

ప్రమోషన్ నిబంధనల్లో స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన వారికి ప్రభుత్వం ఒక కీలక మినహాయింపు ఇచ్చింది. స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా కనీసం 6 నెలల పాటు పనిచేసిన సర్వీసును.. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పూర్తి చేయాల్సిన 2 ఏళ్ల సర్వీసుగా పరిగణించే వెసులుబాటును జీవోలో కల్పించారు. దీనివల్ల అర్హులైన సిబ్బందికి త్వరితగతిన ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది.

MLA salary: లగ్జరీ కార్లు, కోట్ల<strong> రుణాలు.. ఎమ్మెల్యేల స్పెషల్ బెనిఫిట్స్!</strong>
MLA salary: లగ్జరీ కార్లు, కోట్ల రుణాలు.. ఎమ్మెల్యేల స్పెషల్ బెనిఫిట్స్!

శిక్షణ, శాఖాపరమైన పరీక్షలు

డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికైన అభ్యర్థులకు నియామకం తర్వాత నిర్దేశిత ప్రోబేషన్ కాలంలో శిక్షణ ఇవ్వనున్నారు.

  • డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఎంపికైన వారికి 1 సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది.
  • ప్రమోషన్ ద్వారా వచ్చిన వారికి 6 నెలల శిక్షణ ఉంటుంది.

ట్రైనింగ్ లో వీరు రెవెన్యూ టెస్టులు (పార్ట్ 1, 2, 3), సివిల్ జ్యుడీషియల్ టెస్ట్, క్రిమినల్ జ్యుడీషియల్ టెస్ట్, భారతీయ సాక్ష్య అధినియం, సబోర్డినేట్ ఆఫీసర్స్ అకౌంట్స్ టెస్ట్ వంటి నిర్దేశిత శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఎల్ఎల్బి (LL.B) లేదా న్యాయ విద్యార్హతలు ఉన్న అభ్యర్థులకు నిర్దేశిత డిపార్ట్‌మెంటల్ టెస్ట్ విషయాల నుంచి సడలింపులు వర్తిస్తాయి.

జోనల్ పరిధి, అపాయింటింగ్ అథారిటీ

సవరించిన రూల్స్ ప్రకారం డిప్యూటీ తహసీల్దార్ కేటగిరీ-4 నియామకాలను 6 జోన్ల ప్రాతిపదికన వర్గీకరించారు. ప్రమోషన్లు, బదిలీలు, సీనియారిటీ, నియామకాలన్నీ జోనల్ పరిధిలోనే జరుగుతాయి. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. కాగా, కేటగిరీ-4 డిప్యూటీ తహసీల్దార్ల నియామక అధికారిగా భూపరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) వ్యవహరిస్తారని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+