ఏపీలో జనవరి 1 నుంచి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం..!?

ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల వేళ పార్టీలు హామీలతో సిద్దం అవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ తాను అమలు చేసిన సంక్షేమం తిరిగి తనకు అధికారం అప్పగిస్తుందనే ధీమాతో ఉన్నారు. తొలి నుంచి మెజార్టీ సంక్షేమ పథకాలు మహిళలకే అమలు చేస్తున్న ముఖ్యమంత్రి మరో వరం ప్రకటించేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పైన నివేదికలు సిద్దమయ్యాయి.

మహిళలకు ఉచిత ప్రయాణం: కర్ణాటక, తెలంగాణలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సక్సస్ అయింది. కొన్ని సమస్యలు..ఇబ్బందులు ఉన్నా..మహిళలు ఉచిత ప్రయాణం పైన ఆదరణ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల్లో వస్తున్న స్పందన..సమస్యలు..ఆర్దిక భారం పరిగణలోకి తీసుకొని ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

AP Government chances to implement Free bus rides for women and girls from january 1st as reports

పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్నే పాటిస్తే ప్రతి నెలా కనీసం 200 కోట్ల వరకూ ఖజానాపై భారం పడుతుందని ఉన్నతాధికారులు తేల్చారు. రూ.230-240 కోట్ల వరకూ ప్రతి నెలా జీతాలు చెల్లిస్తోంది. కొత్త ఏడాది నుంచే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే, అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

లగ్జరీ బస్సుల్లో రాయితీ: ఏపీలోనూ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పైన అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ పథకం అమలు ద్వారా ఆర్టీసీకి రాబడి ఎంత తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏ మేర భర్తీ చేయాల్సి ఉంటుందనే అంశాల పైన కసరత్తు కొనసాగుతోంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున 40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 15 లక్షల మంది వరకు మహిళలు ఉంటారని అంచనా.

సంక్రాంతి నుంచి అమలు: అన్ని రకాల పాస్ లు కలిగిన వారు 10 లక్షల మంది ఉంటారు. ఇందులో 3-4 లక్షల మంది విద్యార్ధినులు, మహిళలు ఉంటారు. ప్రస్తుతం నిత్యం ప్రయాణించే వారి ద్వారా ఆర్టీసీకి సగటున రూ 17 కోట్ల వరకు రాబడి వస్తోంది.ఒక వేళ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తే నిత్యం రూ 6 కోట్ల వరకు ఆదాయం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

కసరత్తు పూర్తి..నిర్ణయం ఏంటి: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పైన ప్రస్తుతం సాధ్యాసాధ్యాలపైన ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నారు. దీని పైన ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఆర్దిక అంశాలు.. పురుషులు, ఆటో డ్రైవర్ల సమస్యలను సైతం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సాధారణ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేసి..లగ్జరీ బస్సుల్లో రాయితీ ఇవ్వటం పైన నివేదికలో ప్రధానంగా ప్రస్తావన చేసినట్లు సమాచారం.

అయితే, జనవరి 1 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేసే విషయాన్ని ఆర్టీసీ అధికారులు ధ్రువీకరించడం లేదు. అలాగని కొట్టిపారేయడం లేదు. దీంతో..ఈ పథకం పైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చగా మారింది. ముఖ్యమంత్రి జగన్ తుది నిర్ణయం ఏంటనేది ఈ రోజు లేదా రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+