వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు కుదింపుపై ఏపీ సర్కార్ క్లారిటీ- ఎవరేం చెప్పినా ఇదే ఫైనల్...

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు తగ్గింపు దిశగా వైసీపీ సర్కారు నిర్ణయం తీసుకోనుందంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ నిర్ణయం పేరుతో జరుగుతున్న ప్రచారంపై సచివాలయ ఉద్యోగుల సంఘం సీఎంవోను క్లారిటీ కోరింది. దీనిపై స్పందంచిన సర్కారు ఈ మేరకు వారికి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్న రాష్ట్రంలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచడం ద్వారా ప్రభుత్వం కొంత మేర ఊరట పొందనుందనే వార్తలొచ్చాయి.

చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్యే?: స్టిక్కర్ అతికించిన కారులో బ్లాక్‌మనీ, బంగారం?: తమిళనాడులో సీజ్చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్యే?: స్టిక్కర్ అతికించిన కారులో బ్లాక్‌మనీ, బంగారం?: తమిళనాడులో సీజ్

ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుపై జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ప్రభుత్వం... అలాంటిదేమీ లేదని తేల్చిచెప్పింది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ మేరకు జరుగుతున్న ప్రచారం అంతా ఒట్టిదేనని ఉద్యోగులకు క్లారిటీ ఇచ్చింది.ప్రభుత్వోద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తారని కొన్ని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ap government clarifies on rumours of decrease in employees retirement age

ఈ తరహా ప్రచారంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం సీఎం ఆఫీస్ దృష్టికి తీసుకెళ్లింది. దాంతో తప్పుడు ప్రచారం చేసేవారిని ట్రేస్ చేస్తామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది.

English summary
andhra pradesh government has clarified that there is no idea of decrease in employees retirement age in the state. govt denied all the rumours spreading in this regard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X