ఉద్యోగులకు ఏపీ సర్కారు గుడ్‌న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఉద్యోగులకు శుక్రవారం రూ. 6200 కోట్లు చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీపీఎస్, ఏపీజీఏ కింద ఆర్థిక శాఖ రూ 6200 కోట్లు విడుదల చేయనుంది.

ఈ ఏడాది జనవరి 11న ఉద్యోగులకు వివిధ బకాయిల కింద రూ. 1033 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్థిక రమైన ఇబ్బందులు ఉన్నా.. ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తమకు రానున్న బకాయిలను విడుదల చేస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

AP government decides to pay dues to government employees

ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనకు శాసనమండలి ఆమోదం

ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనకు ఏపీ శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మండలిలో ఎస్సీ ఉప వర్గీకరణ పై రాజీవ్ రంజన్ మిశ్ర ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను హోం మంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెట్టారు. ప్రశ్నోత్తరాల తరవ్ాత సభ తిరిగి ప్రారంభం కాగానే స్టేట్‌మెంట్‌​ను ప్రభుత్వం తరపున మంత్రి అనిత ప్రవేశపెట్టారు.

ఎస్సీ వర్గీకరణ అంశం నేపథ్యం సహా ఏకసభ్య కమిషన్ నియమించేందుకు కారణాలను సభకు మంత్రి వివరించారు. రాజీవ్ రంజన్ మిశ్ర కమిషన్ ఇచ్చిన నివేదికలోని అధ్యయన అంశాలను, చేసిన సిఫార్సులను చదివి వినిపించారు. వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకొని ఎస్సీ వర్గీకరణను కమిషన్ నిర్ణయించిందని హోం మంత్రి తెలిపారు.

ఎస్సీలను వెనుకబాటుతనం అధారంగా 3 గ్రూపులుగా విభజించి రిజర్వేషన్ కల్పించాలని కమిషన్ నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. అత్యంత వెనుక బడిన, వెనుకబడిన వర్గం, తక్కువ వెనుకబడిన వర్గాలుగా విభజించిందని తెలిపారు. ఎస్సీలకు ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు వర్తిస్తాయని కమిషన్ చెప్పినట్టు మంత్రి అనిత తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+