తెలంగాణలో ఓటేసే ఏపీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్-సీఈవో కీలక ఆదేశాలు..

తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకోవాలని భావించే ఏపీకి చెందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఓటు హక్కు కలిగి ఉన్న ఏపీ ఉద్యోగులకు రేపు ఓటు వేసేందుకు వీలుగా ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగుల సంఘం నేతలు చేసిన విజ్ఞప్తికి ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా స్పందిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఏపీకి చెందిన ఉద్యోగులు హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వారు తెలంగాణలో రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని భావిస్తే వారికి వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తున్నట్లు ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఇవాళ ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్ర సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి మేరకు సెలవు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

ap government declared paid holiday for state employees voting in telangana polls tomorrow

అయితే ఇలా తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వేతనంతో కూడిన సెలవు కావాలని కోరుకుంటున్న ఏపీ ఉద్యోగులు
సరైన ఆధారాలు చూపించి సెలవు పొందేలా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ ఓటు హక్కు కలిగిన ఉద్యోగులకు ఇది మేలు చేయబోతోంది. అసలే హైదరాబాద్ లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు రేపు సెలవు ప్రకటించడంతో పాటు ఓటింగ్ లో పాల్గొనేలా ప్రోత్సహిస్తోంది. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల వినతిని కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+