అమరావతి పై సుప్రీంలో కీలక పరిణామం - వాట్ నెక్స్ట్..!!

అమరావతి ఏపీ రాజధానిగా కొనసాగింపు పై సుప్రీంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన వైసీపీ ప్రభుత్వం ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ కేసు విచారణ వేళ అఫిడవిట్ ఫైల్ చేసింది. అందులో కీలక అంశాలను ప్రస్తావించింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతే ఉంటుందని స్పష్టం చేసింది. మూడేళ్ల కాలంలో రాజధాని పూర్తి చేస్తామని పేర్కొంది. హైకోర్టు తీర్పును అమలు చేస్తామని వెల్లడించింది. ఎస్ఎల్పీ ని పరిష్కరించాలని కోరింది.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అమరావతి పైన వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇదే సమయంలో న్యాయ పరమైన అంశాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించింది. రాజధాని అంశా నికి సంబంధించిన కేసుల విచారణ నేడు (గురువారం) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌పేరుతో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించింది. అందులో ఏపీ ఏకైక రాజధాని అమరావతి అని వెల్లడించారు. భూము లు త్యాగం చేసిన రైతులకు ఇచ్చిన హామీ మేరకు మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు.

AP Government filed Affidavit in Supreme Court over Amaravati as single capital details here

మాస్టర్ ప్లాన్ లో పేర్కొన్న విధంగా నవ నగరాలతో అభివృద్ధికి తోడ్పడే విధంగా రాజధానిని తీర్చి దిద్దుతామని వివరించారు. రైతులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని స్పష్టం చేసారు. హైకోర్టు, అసెంబ్లీ, కౌన్సిల్‌, రాష్ట్ర సచివాలయం కోసం శాశ్వత భవనాలు సిద్ధమైన తరువాత ప్రస్తుతం ఉన్న భవనాలను ఇత ర అవసరాల కోసం వినియోగిస్తామని వివరించారు. హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, అఖి ల భారత సర్వీస్‌ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల కోసం 2018-19లోనే భవన నిర్మాణాలు ప్రారంభమైన అంశాన్ని సీఎస్ అఫిడవిట్ లో పేర్కొన్నారు.

భూములు ఇచ్చిన రైతు లకు రిటర్న్‌బుల్‌ ప్లాట్లను అన్ని రకాల మౌలిక వసతులతో మూడు సంవత్సరాలల్లో పూర్తి చేస్తా మని ప్రభుత్వం అఫిడవిట్ లో స్పష్టం చేసింది. రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు, సుప్రీంకోర్టు జారీ చేసే ఆదేశాలకు కట్టుబడి ఉంటామని వెల్లడించింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని.. న్యాయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం న్యాయస్థానం ముందు ఉన్న ఎస్‌ఎల్పీ పైన విచారణ ముగించాలని ప్రభుత్వం అఫిడవిట్ లో కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+