పింఛన్ల పంపిణీలో మార్పులు.. చంద్రబాబు సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సారథ్యంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలన పరుగులు తీస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పింఛనుదారులకు వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి పింఛను అందజేసేవారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతోనే పింఛన్లను పంపిణీ చేయిస్తోంది. ఇకనుంచి పింఛన్ల పంపిణీలో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంపిణీకి సంబంధించిన మార్పుచేర్పులు చేసి మార్గదర్శకాలు విడుదల చేశారు.
ఒకటోతేదీ సెలవైతే అంతకుముందు రోజే
ప్రతి నెలా ఒకటోతేదీన పింఛను అందజేసేవారు. ఇకనుంచి ఒకటోతేదీ సెలవు దినమైతే అంతకుముందురోజే పింఛను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ఇదే విధానాన్ని శాశ్వతంగా కొనసాగించబోతున్నారు. ఒకటోతేదీ సెలవు వస్తే అంతకుముందు రోజులు పంపిణీ చేయగా మిగిలిని పింఛన్లను రెండోతేదీన అందజేస్తారు. రెండోతేదీన సెలవు వస్తే మూడోతేదీన అందజేస్తారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఆదేశాలు జారీచేసింది. నెల మొదటిరోజు ఆదివారం వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు. వారికి ఇబ్బందికరంగా ఉండటతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు నెలలో మాత్రం వర్షాలు కురవడంతో మూడురోజులు పంపిణీ చేశారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులద్వారా
గత ప్రభుత్వంలో వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి పింఛన్లను పంపిణీ చేసేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులద్వారా ఇంటింటికీ తిరిగి పింఛన్లను అందజేయిస్తున్నారు. వాలంటీర్లకు వేతనాన్ని రూ.10వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరిసేవలను ఎలా ఉపయోగించుకోవాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లు మినహా మిగతావారిని కొనసాగించే వీలుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ వేతనాలను చెల్లించాలని, తమను విధుల్లోకి తీసుకోవాలంటూ వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications