రాజధానిపై రిపోర్ట్: నిర్ణయం బాబుదే, మరో నివేదిక?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో.. ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆ నివేదికలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అనుకూల, ప్రతికూల పరిస్థితులను కేంద్రానికి వివరించిందే తప్ప నిర్ధిష్టంగా ఎక్కడ రాజధాని ఉండాలన్నది స్పష్టం చేసినట్టు కనిపించడం లేదు. ఇదే సమయంలో బుధవారం కమిటీ ఇచ్చిన నివేదిక తొలి నివేదిక మాత్రమేనని, మరిన్ని అంశాలతో రెండో భాగం నివేదికను ఇవ్వవచ్చునంటున్నారు.

రెండో భాగంలో వివిధ సంస్థల ఏర్పాటు ఎక్కడుంటే బాగుంటుందన్న అంశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇక కమిటీ నివేదిక ఎలా ఉన్నా నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదేననే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో రాష్ట్రంలో పర్యటించిన శివరామకృష్ణన్ కూడా కేవలం వివిధ ప్రాంతాల పరిస్థితులు వివరిస్తామని, నిర్ణయం మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకుంటాయని చెప్పింది. ఇప్పుడు శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో అంశాలు ఎలా ఉన్నా నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందంటున్నారు.

AP government in a fix over choice for capital

అయితే తన అభిప్రాయాలను కేంద్రానికి వివరించిన అనంతరమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నిర్ణయాన్ని ప్రకటిస్తారంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటైన తరువాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ రాజధాని ఉంటే బాగుంటుంది, అక్కడ ఉన్న అనుకూల, ప్రతికూల అంశాలు ఏమిటన్న వివరాలతో నివేదికలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలను శివరామకృష్ణన్ కమిటీకి కూడా సమర్పించింది.

అప్పట్లో మూడు ప్రాంతాల వివరాలను ప్రకటించింది. ప్రకాశం జిల్లాలోని దొనకొండ పేరును ప్రతిపాదిస్తూనే రవాణా సౌకర్యం, నీటి సమస్య ఉంటుందని భావిస్తున్నట్లు ప్రభుత్వమే స్పష్టం చేసింది. గుంటూరు జిల్లాలోని నాగార్జునసాగర్‌ను కూడా మరో రాజధానిగా ప్రతిపాదిస్తూ అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయని, హనుమాన్ జంక్షన్, ఏలూరు, కృష్ణా జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలు కూడా అన్ని కోణాల్లో రాజధానికి అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం ప్రతిపాదించింది.

చివరిలో సాగర్‌కు దగ్గరలో ఉన్న మాచర్ల కూడా రాజధానికోసం తెరపైకి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని సందర్భాల్లో విజయవాడ - గుంటూరు మధ్యలోనే రాజధాని అని కూడా ప్రకటించడంతోపాటు సహచరులకు కూడా ఇదే సంకేతాలు పంపించడం, అభివృద్ధి కార్యక్రమాలకు వేదికగా విజయవాడను ఎంపిక చేయడంతో అదే రాజధానిగా ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికలో భిన్న ప్రతిపాదనలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+