ఏపీలో ప్రభుత్వం చేతిలో సినిమా టిక్కెట్లు - ఏపీఎఫ్సీకి బాధ్యతలు : ప్రత్యేక పోర్టల్ రెడీ...జీవో జారీ..!!

ఏపీలో సినిమా టిక్కెట్ వ్యవహారం పైన మరో కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే సినిమా టిక్కెట్ల ధరల పైన వివాద నడుస్తున్న సమయంలో ఏపీ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణం గా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం కొద్ది నెలలుగా సినిమా టిక్కెట్ల వ్యవస్థ మొత్తం ఆన్ లైన్ ద్వారానే నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు చేస్తూ అమోదించింది.

టాలీవుడ్ ప్రముఖులతో చర్చల తరువాత

టాలీవుడ్ ప్రముఖులతో చర్చల తరువాత

దీని పైన సినీ పెద్దలు..నిర్మాతలు సైతం అంగీకారం తెలిపారు. కానీ, టిక్కెట్ ధరలను తగ్గిచటం.. పెంచుకొనే అవకాశం లేకుండా చేయటంతో పాటుగా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవటం పైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని పైన కోర్టులో విచారణ సాగుతోంది. డిస్ట్రిబ్యూటర్లు..థియేటర్ల యాజమన్యాలు కోర్టుకు వెళ్లటంతో వారికి వరకు కోర్టు ఉపశమనం ఇచ్చింది. పాత ధరల ప్రకారం టిక్కెట్లు అమ్ముకొనే అవకాశం ఇచ్చింది. జిల్లా జాయింట్ కలెక్టర్లకు నిర్ణయాధికారం అప్పగించింది.

అసెంబ్లీలో బిల్లు ఆమోదంతో

అసెంబ్లీలో బిల్లు ఆమోదంతో

ఇక, ప్రభుత్వం టిక్కెట్ల ధరల పైన జారీ చేసిన జీవో నెంబర్ 45ను కోర్టు సస్పెండ్ చేసింది. దీని పైన ఏపీ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ కు వెళ్లగా..కోర్టు విచారణ రేపటికి (సోమవారం) వాయిదా వేసింది. ఇక, ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో నెంబర్ 142 ద్వారా గతంలో తీసుకున్న నిర్ణయాలను అమల్లోకి తెచ్చింది. ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవస్థకు ఏపీ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఈ జీవో ప్రకారం సినిమా టికెట్స్ విక్రయాలు మొత్తం ఏపీఎఫ్సీ పరిధిలో జరగనున్నాయి.

ఏపీఎస్ఎఫ్సీ నోడల్ ఏజెన్సీగా బాధ్యతలు

ఏపీఎస్ఎఫ్సీ నోడల్ ఏజెన్సీగా బాధ్యతలు

రైల్వే ఆన్ లైన్ టిక్కెట్ల నిర్వహణ తరహాలో ఈ విధానం అమలవుతుందని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. తమ నిర్ణయానికి ఏపీ ఫిలం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆమోదం లభించిందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఆన్‌లైన్ విధానంతో బ్లాక్ టికెట్ల దందాకు చెక్ పడుతుందని.. పన్ను ఎగవేసేవారి సంఖ్యను తగ్గించొచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఈ విధానం వెంటనే అమల్లోకి రానుంది. ఇక, ఇదే సమయంలో టిక్కెట్ల ధరల పైన కోర్టు విచారణ తరువాత న్యాయస్థానం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయం జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+