మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇలా - ప్రభుత్వం ఉత్తర్వులు...!!
ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అయింది. ఈ నెల 14న ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. మొత్తం 15 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, SGSW డేటా ఆధారంగా పట్టణాల్లో బీసీ రిజర్వేషన్ల నిర్ణయం తీసుకుంది.
ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తించేలా జీవోలో స్పష్టత ఇచ్చింది. బీసీ రిజర్వేషన్ల ఖరారులో ప్రత్యేక కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి 50 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్ల అమలు చేయనుంది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, SGSW డేటా ఆధారంగా పట్టణాల్లో బీసీ రిజర్వేషన్ల నిర్ణయం తీసుకుంది. ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాల వారీగా రిజర్వేషన్ల ఖరారు చేసింది. మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, వార్డు సభ్యుల స్థానాలకు రొటేషన్ విధానంలో రిజర్వేషన్లు ఖరారు చేసింది. 2021లో అమలు చేసిన రిజర్వేషన్ సర్కిల్ ఆధారంగా తదుపరి రిజర్వేషన్లు వర్తింపజేయనుంది.

ఏ కేటగిరీలో ఎన్ని సీట్లు
అదే విధంగా ఆయా వార్డుల పునర్విభజన జరిగితే వార్డు సభ్యుల రిజర్వేషన్ సర్కిల్ కొత్తగా ప్రారంభించనుంది. రిజర్వేషన్ల అమలుపై తదుపరి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ పరిపాలన శాఖకు ఆదేశాలు జారీ చేసింది. మొదట ఎస్టీ, తర్వాత ఎస్సీ, ఆపై బీసీ ప్రాధాన్యం క్రమంలో స్థానాలను కేటాయించింది. గతంలో ఇచ్చిన 33.33శాతం బీసీ రిజర్వేషన్ల జీఓపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్త ఉత్తర్వులు మున్సిపల్ శాఖ ఇచ్చింది. కేటగిరీల వారీగా బీసీలకు దక్కే స్థానాల పైన స్పష్టత ఇచ్చారు. మేయర్ పదవులు: 35.29% శాతం మేర దక్కనున్నాయి. అందు లో భాగంగా మున్సిపల్ వార్డులు మొత్తం 3884 స్థానాల్లో 1273 సీట్లు బీసీలకు రిజర్వ్ చేసారు. అదే విధంగా మున్సిపల్ ఛైర్మన్ లు.. మొత్తం 106 కు గాను 35 సీట్లు, కార్పోరేషన్ మేయర్లు 17 కు గాను..6 మేయర్లు బీసీలకు 35.29 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసారు.













Click it and Unblock the Notifications
