సచివాలయల సిబ్బందికి ప్రభుత్వం షాక్ - తాజా ఆదేశాలు..!!
ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వైసీపీ హయాంలో ఏర్పాటైన వార్డు, గ్రామ సచివాలయాల నిర్వహణ.. సిబ్బంది విషయంలో ప్రభుత్వం కొత్త కార్యాచరణ సిద్దం చేస్తోంది. గ్రామ సచివాలయాలను పంచాయితీలతో అనుసంధానం చేసే విధంగా కసరత్తు చేపట్టింది. అదే విధంగా సిబ్బంది విషయంలోనూ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాలు వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు షాకింగ్ గా మారాయి.
తాజా నిబంధనలు
వార్డు, గ్రామ సచివాయాల సిబ్బందికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రతీ నెలా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. తొలి రోజునే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. కాగా, ఈ రోజు ఆదివారం కావటంతో నిన్న(శనివారం) రోజునే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా గతంలో వాలంటీర్లతో జరిగే పెన్షన్ల పంపిణీ కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో కొనసాగిస్తోంది. వేకువజాము నుంచే పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించింది.

షోకాజ్ నోటీసులు
అయితే, నిర్దేశించిన సమయం లోగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేయలేదంటూ వార్డు,గ్రామ సచివాలయాల సిబ్బందికి షో కాజ్ నోటీసు లు జారీ అయ్యాయి. టార్గెట్ పూర్తి చేసినా తమకు నోటీసులు ఇవ్వటం పైన సచివాలయాల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యల కారణంగానే తాము లాగిన్ కాలేకపోయామని చెబుతున్నారు. అదే విధంగా సచివాలయాల సిబ్బంది హాజరు పైనా ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక నుంచి ప్రతీ సచివాలయంలో సిబ్బంది వారి అటెండెన్స్ మొబైల్ యాప్ లో సచివాలయానికి వచ్చిన సమయం, వెళ్లిన సమయం రెండూ నమోదు చేయాలని ఆదేశాలను జారీ చేసింది. ఒకే సారి ఎంటర్ చేసినా.. ఎకేసారి ఎంట్రీ ఉన్నాఆ రోజు ఉద్యోగి సెలవుగా పరిగణిస్తామంటూ సందేశా లు అందాయి.
అనుసంధానం
గతంలో ఉద్యోగులు సచివాలయానికి వచ్చినప్పుడు లేదా వెళ్లే సమయంలో ఒకసారి హాజరు తప్పనిసరి అనే ఆదేశాలు ఉండేవి. ఇప్పుడు ఆఫీస్ కు వచ్చినా, వెళ్లినా ఖచ్చితం గా హాజరు ఉండాల్సిందేననే స్పష్టం చేసారు. వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోకపోవటంతో ప్రస్తుతం సచివాలయ సిబ్బంది పైన పతి ఒత్తిడి పెరుగుతోంది. అదే విధంగా ఇక సచివాలయాల ను గ్రామాల్లో పంచాయితీలను అనుసంధానం చేయటం ఖాయంగా కనిపిస్తోంది. అవసరం మేర సిబ్బందిని సచివాలయ వ్యవస్థలో వినియోగించుకుంటూ.. మిగిలిన సిబ్బందిని ప్రభుత్వ శాఖల కు అటాచ్ చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications