వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బతుకమ్మకు ఏపీ ఆప్షనల్ హాలీడే, హోంగార్డు వేతనాలు పెంచిన కేసీఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 2015 సెలవులను ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పని చేసే ఏపీ ఉద్యోగులకు బతుకమ్మ, బోనాల పండుగకు ఆప్షనల్ హాలీడేగా ప్రకటించింది. జనవరి 14వ తేదీన సంక్రాంతి జరపాలని నిర్ణయించింది. ఉద్యోగులకు 23 ఐచ్ఛిక, 21 సాధారణ సెలవులు ఇచ్చింది.

హోంగార్డుల వేతనాలు పెంపు

హోంగార్డుల వేతనాలు పెంపుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. హోంగార్డుల వేతనాలు రూ.9వేల నుండి రూ.12వేలకు పెంచుతున్నట్లు చెప్పారు. ఏప్రి నెల నుండి పెంచిన వేతనాలు అమలవుతాయన్నారు.'

AP government optional holiday for Bathukamma and Bonalu

హోంగార్డులకు ఆరోగ్య బీమా, ఏడాదికి రెండు డ్రెస్సులు ఇవ్వనున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని 16వేల మంది హోంగార్డులకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.

చంద్రబాబు రాసిన లేఖ బయటపెట్టాలి: డీకే అరుణ

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి రాసిన లేఖను బయటపెట్టాలని మాజీ మంత్రి డీకే అరుణ శుక్రవారం డిమాండ్ చేశారు. వాస్తవాలు ప్రజలకు తెలిసే విధంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు పైన ఒత్తిడి తేవాలన్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు జిల్లా రైతుల హక్కు అన్నారు.

English summary
Andhra Pradesh government optional holiday for Bathukamma and Bonalu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X