మహిళలకు, రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌లో డబ్బులు జమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు, రైతులకు వరుసగా డబ్బులు విడుదల చేస్తోంది. తాజాగా ఈబీసీ నేస్తం, చేయూత, ఆసరా కింద నిధుల్ని వారి, వారి అకౌంట్లకు బదిలీ చేసింది. రైతులకు సంబంధించి ఇన్‌పుట్ రాయితీని కూడా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈబీసీ నేస్తం కింది అర్హులైన మహిళల ఖాతాల్లో రూ.15వేలు వేశారు. వైఎస్సార్ చేయూత కింద రూ.18,750 అందిస్తోంది. ఈ పథకానికి సంబంధించినవి కూడా విడుదలయ్యాయి. వైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా మహిళలకు రూ.1843 కోట్లను వారి ఖాతాల్లో జమచేశారు.
రైతులకు రూ.1236 కోట్లు
రైతులకు రూ.1236 కోట్లను ఇన్‌పుట్ రాయితీ కింద విడుదల చేశారు. ఈ పథకాలకు సంబంధించిన అర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచారు. ఖాతాల్లో డబ్బులు పడనివారు సచివాలయ సిబ్బందిని సంప్రదించాలి. మే 13న పోలింగ్ సమయంలో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే ఈసీ నుంచి అనుమతి రాలేదు. కొందరు లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించగా ఎన్నికల సంఘాన్ని మరోసారి కోరండి అని కోర్టు తీర్పు ఇచ్చింది.

రూ.5868 కోట్లు విడుదల
దీంతో ప్రభుత్వం ఈసీని కోరినప్పటికీ డీబీటీ పథకాల డబ్బులు జమచేసేందుకు అనుమతివ్వలేదు. అంత అత్యవసరం ఏమిటని ప్రశ్నించింది. పోలింగ్ ముగిసిన తర్వాత జమచేసుకోమని చెప్పింది. పిటిషన్లపై కోర్టులో మరోసారి విచారణ జరిగింది. మే 10వ తేదీ వరకు ఈసీ ఇచ్చిన ఆదేశాలను పక్కన పెడుతున్నట్లు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. మే 10న డబ్బుల్ని జమ చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. ఈసీని అనుమతి కోరగా.. ఈసీ తిరస్కరించింది. మళ్లీ హైకోర్టులో విచారణ జరగ్గా.. వేసవి సెలవుల తర్వాత విచారిస్తామంటూ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. పోలింగ్ ముగియడంతో లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారు. నాలుగు రోజుల్లో 5868 కోట్లరూపాయలు విడుదల చేశారు.












Click it and Unblock the Notifications