Amaravati: మంత్రులు, ఐఏఎస్ లు, జడ్జీలకు అమరావతిలో బిగ్ న్యూస్..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతేడాది పనుల పునఃప్రారంభం తర్వాత ఇప్పటికే మొదలుపెట్టిన పనులు వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పాలనకు కీలకమైన అధికారులు, న్యాయమూర్తులు, మంత్రులకు సంబంధించిన క్వార్టర్స్ రెడీ అవుతున్నాయి. ఇవాళ వీటిని పరిశీలించిన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఇవాళ వీటిపై కీలక అప్డేట్ ఇచ్చారు.
అమరావతిలో నిర్మాణంలో ఉన్న నిర్మాణంలో ఉన్న ప్రధాన కార్యదర్శులు, నాయ్యమూర్తులు, మంత్రుల బంగళాలను మంత్రి నారాయణ పరిశీలించారు. వీటి పురోగతిని అధికారుల్ని అడిగి తెలుసుుకున్నారు. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ లో ఈ భవనాలు అధికారులు, న్యాయమూర్తులు, మంత్రులకు అందజేస్తామని తెలిపారు. అమరావతిలో మొత్తం 4026 భవనాలు, ఫ్లాట్ లు కడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే 186 బంగళాలు కడుతున్నట్లు తెలిపారు. బంగళాలు కాకుండా 3850 అపార్ట్మెంట్ మోడల్ లో నిర్మాణాలు చేపడుతున్నట్లు నారాయణ పేర్కొన్నారు.

ఈ ఏడాది వర్షాలు అధికంగా వచ్చాయని, వర్షాలు తగ్గాక అన్ని పనులు చేపట్టామన్నారు. మంత్రుల బంగళాలు చాలా వరకు కంప్లీట్ అయ్యాయని, జడ్జి బంగళాల్లో బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్ తుదిదశకు చేరాయన్నారు. అఖిల భారత సర్వీసులు అధికారుల టవర్ లు కూడా తుది దశకు చేరాయన్నారు. 500 నివాస సముదాయాలు మినహా మిగిలిన అన్ని మార్చి ఎండింగ్ కు పూర్తి అవుతాయన్నారు. ఈ భవనాలన్నీ జీఏడీకి అప్పగిస్తామన్నారు. అనంతరం వారు కేటాయింపులు చేస్తారన్నారు. మరోవైపు సీడ్ యాక్సిస్ రోడ్ భూసేకరణ నోటిఫికేషన్ బుధవారం ఇస్తామన్నారు. ఇంకా నాలుగున్నర ఎకరాలు రావాల్సి ఉందని, దీనిలో 2 ఎకరాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications