ఏపీలో వారికి ఫించన్లు కట్.. బిగ్ షాక్ ఇచ్చిన కూటమి సర్కారు !
ఏపీలో పింఛన్‌ల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెన్షన్లను పెంచారు సీఎం చంద్రబాబు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా తరుణంలో తొమ్మిది నెలలు దాటినా.. కొత్త ఫించన్లు మాత్రం ఇంత వరకు మంజూరు కాలేదు. కానీ మరోవైపు అనర్హుల తొలగింపు ప్రక్రియ మాత్రం కొనసాగుతోంది. ఇప్పుడు దివ్యాంగుల కోటా ఫించన్లపై సర్కారు ఫోకస్ పెట్టింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి బోగస్ పింఛన్ని ఏరివేసే పనిలో పడింది. ఇప్పుడు దివ్యాంగుల కోటాలో అర్హతలు లేని వేలాది మందికి పింఛన్లు మంజూరయ్యాయని అధికారులు గుర్తించారు. వైసీపీ హయాంలో సరైన ధ్రువీకరణ లేకుండానే పింఛన్లు మంజూరు చేసినట్లు తేల్చారు. దాంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ తనిఖీలు మొదలు పెట్టింది.

కాగా దివ్యాంగుల కోటాలో ఏపీ వ్యాప్తంగా లక్షలాది మంది పింఛన్లు పొందుతున్నారు. ఈ క్రమంలోనే 175 నియోజకవర్గాల్లో 4 లక్షల పింఛన్లను ఇప్పటి వరకు తనిఖీ చేయగా.. అందులో లక్షకు పైగా అనర్హులుగా తేలినట్లు సమాచారం. మాజీ సీఎం జగన్ నియోజకవర్గం పులివెందులలోనే అత్యధికంగా బోగస్ పింఛన్లు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంధత్వం, చెవుడు, శారీరక వికలాంగత వంటి లక్షణాలు లేనప్పటికీ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పింఛన్లు పొందిన వారి సంఖ్య 50 వేల మందికి పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కంటి చూపు ఉన్నా కూడా దివ్యాంగులుగా తప్పుడు పత్రాల ద్వారా పింఛన్లు పొందిన వారు సుమారు 23 వేలమంది ఉన్నారని.. వినికిడి లోపం లేనప్పటికీ 20 వేల మంది చెవుడిగా పింఛన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది దివ్యాంగులకు నోటీసులు జారీ చేశారు. వీరిలో ఇప్పటివరకు 4.76 లక్షల మంది అధికారులు జరిపిన రీ-వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. మిగిలిన వారు స్పందించకపోతే మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు. అయినా హాజరుకాకపోతే పింఛన్లను నిలిపివేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ఇప్పటికే తుదిదశకు చేరుకుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
బోగస్ ఫించన్లు..
పులివెందుల తర్వాత అత్యధిక బోగస్ పింఛన్లు కాకినాడ సిటీ నియోజకవర్గంలో గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 88 నియోజకవర్గాల్లో 970 మంది అనర్హులకు పింఛన్లు ఇచ్చినట్లు తేలింది. ఇక 59 నియోజకవర్గాల్లో 500కు పైగా, 13 నియోజకవర్గాల్లో 1,000-1,300 మధ్య బోగస్ పింఛన్లు ఉన్నట్లు నమోదు చేశారు. విశాఖపట్నం దక్షిణం (39), తాడికొండ (55), విశాఖ ఉత్తరం (57)లో బోగస్ ఫించన్లు ఉన్నట్లు స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications