గోదావరి వాసులకు కేంద్రం శుభవార్త.. త్వరలో ఆ కీలక ప్రాజెక్ట్..!
ఏపీలో ప్రతీ జిల్లాలోనూ పర్యాటక స్థలాలు, ప్రాంతాలు, గుడులు, గోపురాలు ఉన్నప్పటికీ గోదావరి జిల్లాలది ఇందులో ప్రత్యేక స్ధానం. అలాంటి గోదావరి జిల్లాల్లో పర్యటనల కోసం పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. కానీ ఇలా వచ్చే వారికి గోదావరి జిల్లాల్లో సరైన ఏర్పాట్లు లేకపోవడం, ఉన్న వాటిని సైతం అభివృద్ధి చేయకపోవడంతో వీరి సంఖ్య రానురానూ తగ్గిపోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గోదావరి జిల్లాలను ఆధ్యాత్మిక పర్యాటక హబ్ గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.
అఖండ గోదావరి ప్రాజెక్ట్
ఇందులో భాగంగా త్వరలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేయనున్నట్లు పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి పరిసర ప్రాంతాల్లో కొత్త సొబగులు రానున్నాయని ఆయన తెలిపారు. అఖండ గోదావరి ప్రాజెక్ట్ పూర్తయితే హేవలాక్ వంతెన, కడియం నర్సరీలు, నిడదవోలు కోట సత్తెమ్మ ఆలయం సరికొత్తగా దర్శనమిస్తాయన్నారు.

కేంద్రం రూ.97 కోట్ల నిధులు
చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని తెలిపేలా ఈ ప్రాజెక్ట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకులకు మెరుగైన వసతుల కల్పన ఇందులో భాగమన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంజూరైన ప్రతిష్టాత్మక అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ పథకం ద్వారా మంజూరైన రూ.97 కోట్లతో రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, కడియం, కొవ్వూరు, నిడదవోలు తదితర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి పనులు జరగనున్నాయని మంత్రి తెలిపారు.
పుష్కరాల్లోపే పనులు పూర్తి
పవిత్ర గోదావరి పుష్కరాలలోపే ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తద్వారా గోదావరి పరిసర ప్రాంతాలు సరికొత్త సొబగులు సంతరించుకోనున్నాయని, చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని తెలిపేలా సందర్శకులకు మెరుగైన వసతుల కల్పనతో పాటు మంచి అనుభూతిని అందిస్తామని పేర్కొన్నారు. 127 ఏళ్ల చరిత్ర గలిగి వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచిన చారిత్రాత్మక హేవలాక్ బ్రిడ్జిని ఆధునికీకరిస్తామన్నారు. హేవలాక్ వంతెన ప్రాంతంలో జలపాతాలు, గ్లాస్ వంతెనలు, గేమింగ్ జోన్, స్పేస్ థీమ్, అర్బన్ హాట్ క్రాఫ్ట్ బజార్, హ్యాంగింగ్ గార్డెన్స్, హాలోగ్రామ్ జూ, టైమ్ ట్రావెల్, రైల్ మ్యూజియం, ఆక్వేరియం టన్నెల్ లు ఏర్పాటు చేస్తారు.

హేవలాక్ బ్రిడ్జి, పుష్కర్ ఘాట్ లింక్
హేవలాక్ వంతెన పక్కనే ఉన్న పుష్కర్ ఘాట్ ను మరింతగా అభివృద్ధి చేసి అధ్యాత్మిక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. హేవలాక్ వంతెన, పుష్కర్ ఘాట్ రెండింటిని అనుసంధానించి డైనమిక్ టూరిస్ట్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దనున్నారు. పుష్కరాల రేవులో ఏడాది పొడవునా పవిత్ర స్నానాలు ఆచరించేలా, అధ్యాత్మికత స్పురించేలా, మరింత అధ్యాత్మికత ఉట్టిపడేలా చుట్టూ ఉన్న ఆలయాలను ఆర్కిటెక్చరల్, డిజైన్ లతో సౌందర్యవంతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు.
కడియం నర్సరీ, కోటసత్తెమ్మ ఆలయాలూ...
అలాగే దేశంలోనే అతి పెద్ద నర్సరీలో ఒకటైన కడియం నర్సరీకి పర్యాటక శోభ తెచ్చి సమీపంలోని గోదావరి కాలువ తదితర చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలకు పూర్వ వైభవం తీసుకువస్తారు. గోదావరి చుట్టు ప్రక్కల పర్యాటకులు ఆహ్లాదంగా సేదతీరేలా, ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించేలా, కాలువలో పడవపై షికారు చేసే విధంగా తీర్చిదిద్దుతారు. ఇందులో విశిష్టమైన చారిత్రక నేపథ్యం కలిగి, అద్భుతమైన ప్రాకారాలు, ఆకట్టుకునే ముఖ ద్వారం, ఎత్తైన రాజగోపురంతో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో అలరారుతున్న ప్రముఖ మహిమాన్విత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కోట సత్తమ్మ దేవాలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దుతారు.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications