వార్డు, గ్రామ సచివాలయ సేవల్లో కీలక నిర్ణయం - ఇక నుంచి..!!

గ్రామ-వార్డు సచివాలయ సేవల్లో మరో మార్పుకు రంగం సిద్దం అయింది. ఇప్పటికే సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి ముందుకే సేవలు అందుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. పలు రకాల సర్టిఫికెట్లు కూడా సచివాలయం ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇక నుంచి సచివాలయంలో పథకాలు..సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సేవలు మరింత సులభతరం కానున్నాయి. ఇందు కోసం సచివాలయాల శాఖ కసరత్తు చేస్తోంది.

AP Government to launch WhatsApp services in Village - ward Secretariats for all services

"హాయ్" అని పంపిస్తే చాలు: సచివాలయ వ్యవస్థ ద్వారా ఇప్పుడు పలు రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటి వద్ద నుంచే సేవలు అందుతున్నాయి. ఇక నుంచి వాట్పస్ ద్వారానే సచివాలయ సేవలు అందించేందుకు కసరత్తు జరుగుతోంది.

సచివాలయ పరిధిలో నిర్దేశించిన నెంబర్ కు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి "హాయ్" అని మెసేజ్ చేస్తే మీరు పెట్టుకున్న ధరఖాస్తు ఏ దశలో ఉందో సమాధానం వస్తుంది. అదే సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పధకాల్లో లబ్దిదారులకు వాట్సప్ ద్వారా సేవలు అందుబాటులోకి రానున్నాయి.

మొబైల్ కే నేరుగా సర్టిఫికెట్లు: ఇప్పటికే నవరత్నాల పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారికి సమాచారం వాట్సప్ ద్వారా అందిస్తున్నారు. పథకాల్లో లబ్దిదారులుగా అర్హత ఉందా, లేకుంటే ఏ కారణంగా తిరస్కరిస్తున్నారనే వివరాలు వాట్సప్ ద్వారానే తెలుసుకొనే వెసులుబాటు కలుగుతోంది.

ఇక నుంచి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను కూడా కావాలంటే సంబంధిత గ్రామ - వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే అధికారుల ఆమోదం పొందగానే.. తిరిగి వాట్సప్ ద్వారానే వాటిని పొందే అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించి సచివాలయ శాఖ తమ అధికారిక ప్రభుత్వ సేవల పోర్టల్ లో మార్పులు చేస్తోంది.

వాట్సప్ ద్వారానే అన్ని సేవలు: త్వరలోనే ప్రతీ వార్డు -సచివాలయ పరిధిలోని ప్రతీ ఒక్కరికీ వాట్సప్ ద్వారా సమాచారం - సేవలు అందించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. సచివాలయాల్లో నోటీసు బోర్డుల్లో ఉంచే సమాచారం కూడా ఇక నుంచి వాట్సప్ ద్వారానే లబ్ది దారులకు అందనుంది. తమ ఆధార్ నెంబర్ తో పాటుగా పథకం గురించి వాట్సప్ ద్వారా సమాచారం పంపిస్తే..లబ్దిదారునికి కావాల్సిన వివరాలు తిరిగి సమాధానంగా అందుతుంది.

పెన్షన్, రేషన్ కార్డు తో సహా ఎలాంటి ధ్రువీకరణ పత్రం అయినా దరఖాస్తు చేసిన తరువాత ఏ స్థాయిలో ఉందో కూడా తెలుసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. పరిశీలన - ఆమోదం స్థాయి గురించి ఎప్పటికప్పుడు కార్యాలయాలకు వెళ్లకుండానే వాట్సప్ ద్వారా తెలుసుకొనే వెసులుబాటు కలగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+