ఏపీలో వినాయక మండపాలకు గుడ్ న్యూస్.! లోకేష్ కీలక ప్రకటన..!
ఏపీలో వినాయక చవితికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఊరూవాడా భారీగా బొజ్జ వినాయకుడిని కొలువుదీర్చేందుకు మండపాలు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ వినాయక మండపాల నిర్వాహకులకు ఓ శుభవార్త చెప్పింది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. త్వరలో దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వబోతున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో మండపాల నిర్వాహకులకు ఈసారి ఖర్చు కూడా తగ్గబోతోంది.
వినాయక చవితి సందర్భంగా ఉత్సవ సమితులు, మండపాల నిర్వాహకులకు శుభవార్త అంటూ లోకేష్ ఇవాళ ట్వీట్ చేశారు. ఇందులో వినాయక ఉత్సవాలు జరిగే రోజుల్లో మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నా దృష్టికి మీరు తీసుకువచ్చిన వినతిని సీఎం చంద్రబాబు గారు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారితో చర్చించానని తెలిపారు. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు అంగీకరించిన ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేయనుందన్నారు.

వినాయక చవితి సందర్భంగా ఉత్సవ సమితులు, మండపాల నిర్వాహకులకు శుభవార్త. వినాయక ఉత్సవాలు జరిగే రోజుల్లో మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నా దృష్టికి మీరు తీసుకువచ్చిన వినతిని సీఎం చంద్రబాబు గారు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారితో చర్చించాను. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్… pic.twitter.com/pSKvIxGcZ0
— Lokesh Nara (@naralokesh) August 25, 2025
అలాగే రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు దుర్గా పందిళ్లకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. వినాయక చవితి, దసరా ఉత్సవాల ఉచిత విద్యుత్ కోసం రూ.25 కోట్లు కూటమి ప్రభుత్వం వెచ్చించనుందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. దీంతో ఈ రెండు పండుగలు ఘనంగా జరుపుకునేందుకు నిర్వాహకులు మరింత ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకునేందుకు వీలు కలిగింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు వినాయక చవితి, దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించింది. దీంతో ఏపీలోనూ ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఈ ఉచిత విద్యుత్ పరిమితులపై ప్రభుత్వం అమలు ఉత్తర్వుల్లో క్లారిటీ ఇవ్వనుంది.












Click it and Unblock the Notifications