ఏపీలో ఆగస్టు 15న మూడు పథకాలు? నిజమెంత?
ఏపీలో తాజాగా అధికారం చేపట్టిన కూటమి సర్కార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మ్యానిఫెస్టో హామీలను అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే వాటిలో అడుగులు మాత్రం వేగంగా ముందుకు పడటం లేదు. ఇప్పటివరకూ సంక్షేమ పథకాల్లో కేవలం పెన్షన్ల పెంపు మాత్రమే అమలైంది. మిగతా పథకాలపై ఇప్పుడు, అప్పుడు అంటూ కాలం గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మూడు పథకాలు ప్రారంభిస్తున్నారంటూ టీడీపీ నేతలు చెప్తున్నారు.
ఎల్లుండి ఆగస్టు 15న రాష్ట్రంలో మొత్తం మూడు పథకాలను కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తోందంటూ ఇప్పటికే టీడీపీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. వీటిలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణతో పాటు తల్లికి వందనం, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా ఉన్నాయంటూ వారు ప్రచారం చేస్తున్నారు. వీటిలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆగస్టు 15న ప్రారంభిస్తామంటూ మంత్రులు ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే వాస్తవ పరిస్ధితి మాత్రం వేరేలా ఉంది.

రాష్ట్రంలో ఆగస్టు 15న అన్న క్యాంటీన్ల పునఃప్రారంభానికి ప్రభుత్వం ప్రకటన చేసింది. సీఎం చంద్రబాబు కృష్ణాజిల్లా ఉయ్యూరులో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తారని ప్రభుత్వం తెలిపింది. కానీ మిగతా రెండు పథకాలపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై మంత్రులు, ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు
అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం దాటవేత ధోరణిలోనే ఉంది. ఇప్పటికే మండలిలో విద్యా మంత్రి నారా లోకేష్.. వచ్చే ఏడాది నుంచి పథకం అమలు చేస్తామంటూ ప్రకటించారు. దీనికి త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. కానీ ఇప్పటివరకూ మార్గదర్శకాలు రాలేదు. అలాగే ఎన్నికల హామీ మేరకు ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ దీన్ని వర్తింపచేస్తామని చెప్తున్నారు. కానీ దీనిపైనా అధికారిక ఉత్తర్వులు రాలేదు. అసలు ఈ ఏడాదికి ఇవ్వాల్సిన అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం పేరుతో అమలు చేయాల్సి ఉండగా.. నిధుల కొరతతో దీన్నీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కానీ ఇవేమీ తెలియని టీడీపీ, జనసేన నేతలు మాత్రం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications