ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అర్హులు - మార్గదర్శకాలు..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు వేస్తుంది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలను ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ 4 వేలకు పెంచిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు మరో పథకం అమలువైపు కసరత్తు ప్రారంభించింది. దీపావళి నుంచి ప్రారంభించనున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి మార్గదర్శకాలను సిద్ధం చేస్తుంది.
చంద్రబాబు హామీ
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రతి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించి పవర్ సర్ఫరాల శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలోని 1.55 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవారికి ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తే ఏడాదికి రూ 3,640 ఓట్లు ఖర్చవుతాయి. అదే సమయంలో దీపం, ఉజ్వల, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్ తీసుకున్న 75 లక్షల మందికి పథకం అమలు చేస్తే సాలిన రూ 1,763 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు లెక్కలు తేల్చారు. పూర్తి వివరాలతో పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది.

సిఫార్సులు
నివేదిక పైన మంత్రుల కమిటీ సమావేశమై ప్రభుత్వానికి అమలుకు సంబంధించి సిఫార్సులు చేయనుంది. ఎన్నికల హామీల్లో ప్రతి ఇంటికి ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కో సిలిండర్ ధర రూ 825 వరకు ఉంది. ఈ పథకాన్ని తెల్ల కార్డు ప్రాతిపదిక అమలు చేస్తే 1.47 కోట్ల కుటుంబాలు అర్హత సాధిస్తాయి. ఉజ్వల కింద పరిగణలోకి తీసుకుంటే సిలిండర్ కు రూ 300 చొప్పున రాయితీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే దీపంతో పాటుగా ఇతర పథకాల కింద ఉన్న 65 లక్షల కనెక్షలను ఉజ్వల కింద మార్చుకొని అవకాశం కలుగుతుంది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పైన కొంతమేర భారం తగ్గుతుంది.
ప్రభుత్వం సమాయత్తం
9.70 లక్షల ఉజ్వల వినియోగదారులకు కేంద్ర ఒక్కో సిలిండర్ పై రూ 300 చొప్పున ఏడాదికి 12 సిలిండలకు రాయితీ ఇస్తుంది. అంటే వీరికి ఒక్కో సిలిండర్ పై రూ 525 చొప్పున రాయితీ ఇవ్వాలి. మూడు సిలిండలకు ఏడాదికి రూ 153 కోట్లు ఖర్చు అవుతుంది. దీపం, ఆయిల్ కంపెనీలు ఇచ్చిన 65 లక్షల కనెక్షన్లకు ఒక్కో సిలిండర్కు 825 చొప్పున ఏడాదికిచ్చే మూడు సిలిండర్లకు 1610 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ పథకం అమలుకు సంబంధించి వచ్చేవారం మార్గదర్శకాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంది.
-
అమరావతి ఖర్చు అసలు లెక్క ఇదీ..!! -
Chandrababu: కాఫీ విత్ చంద్రబాబు-కార్యకర్తల కోసం కొత్త కబుర్లు ఇవే..! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే!











Click it and Unblock the Notifications