టీవీకి రూ.4 లక్షలా, దుబారా: బాబుకు అంబటి నిలదీత

అవసరమైతే చెట్ల కింద కూర్చొని పాలిస్తామని చెప్పిన చంద్రబాబు.. తాత్కాలిక చాంబర్ కోసం రూ.36 కోట్లు ఖర్చు చేయడమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరు చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి చెడ్డపనులు అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టే కార్యక్రమం సీఎం ఆధ్వర్యంలోనే జరుగుతోందన్నారు.
ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు చాంబర్ కోసం రూ.80 లక్షలు ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. ఒక్క టీవీ కోసమే రూ.4 లక్షలు వెచ్చించారని ఆరోపించారు. సభాపతి కోడెల శివప్రసాద్ స్టడీ టూర్ల పేరుతో జోహెన్నెస్ బర్గ్, కేఫ్ టౌన్, కెన్యా, మారిషస్ వెళ్తున్నారని, ఆ దేశాల్లో చట్టసభల తీరు గురించి మనం తెలుసుకోవాల్సింది ఏముందని ప్రశ్నించారు.
రాజధాని కోసం చందాలు వసూలు చేస్తున్న దశలో ఇంత ఖర్చు దేనికని చంద్రబాబును నిలదీశారు. దుబారా ఖర్చు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. కారు కోసం రూ.28 లక్షలు దుపారా చేశారని మండిపడ్డారు. మంత్రులు టూర్ల పేరుతో ఖజానాను ఖాళీ చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications